అమెరికా అడవి జంతువులో తొలి కరోనా కేసు
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటి వరకు మానవాళిని అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారి ఇప్పుడు జంతువులకు కూడా సోకడం మొదలైంది. తాజాగా అమెరికా ఉటా స్టేట్‌లోని ఫామ్ హౌజ్‌లో అడవి జంతువు మింక్(ముంగిసలను పోలిన జంతువు)కు కరోనా సోకినట్లు యూఎస్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ధ్రువీకరించింది. ఉన్ని(రోమాలు) కోసం చైనా, డెన్మార్క్, నెదర్లాండ్స్, యూఎస్, కెనడా, పోలాండ్ వంటి దేశాల్లో ఈ మింక్‌లకు ప్రత్యేక ఫామ్ హౌజ్‌లు ఏర్పాటు చేసి పెంచుతుంటారు. యూఎస్‌లోని ఉటా, విస్కన్సిన్, ఓరిగన్, మిచిగన్ ప్రాంతాల్లోని […]
దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటి వరకు మానవాళిని అతలాకుతలం చేసిన కొవిడ్ మహమ్మారి ఇప్పుడు జంతువులకు కూడా సోకడం మొదలైంది. తాజాగా అమెరికా ఉటా స్టేట్‌లోని ఫామ్ హౌజ్‌లో అడవి జంతువు మింక్(ముంగిసలను పోలిన జంతువు)కు కరోనా సోకినట్లు యూఎస్ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ ధ్రువీకరించింది. ఉన్ని(రోమాలు) కోసం చైనా, డెన్మార్క్, నెదర్లాండ్స్, యూఎస్, కెనడా, పోలాండ్ వంటి దేశాల్లో ఈ మింక్‌లకు ప్రత్యేక ఫామ్ హౌజ్‌లు ఏర్పాటు చేసి పెంచుతుంటారు.
యూఎస్‌లోని ఉటా, విస్కన్సిన్, ఓరిగన్, మిచిగన్ ప్రాంతాల్లోని 16 ఫామ్ హౌజ్‌ల్లో కొవిడ్ టెస్టులు చేసినట్లు వెటర్నరీ సర్వీసెస్ లేబొరేటరీ తెలిపింది. ఉటా ఫామ్ హౌజ్‌లోనే బందీగా కాకుండా స్వేచ్ఛగా తిరుగుతున్న ఒక మింక్‌కు కొవిడ్ పాజిటివ్ తేలినట్లు పేర్కొంది. కాగా, మింక్‌కు కొవిడ్ సోకగానే దానిపై హెల్త్‌పై ప్రభావం చూపెట్టిందని, అది గుంపులో ఉన్నప్పటికీ లక్షణాలను గుర్తించినట్లు వెటర్నరీ డాక్టర్ డీన్ టేలర్ చెప్పాడు. తొలిసారిగా గతవారం కెనడాలోని ఓ ఫామ్ హౌజ్‌లో గల మింక్‌కు కొవిడ్ సోకింది. ఇక ఆ తర్వాత నెదర్లాండ్స్, డెన్మార్క్, స్పెయిన్, స్వీడన్, ఇటలీ, అమెరికాలో ఈ జంతువులకు వైరస్ సోకినట్లు నివేదికలు రావడంతో వ్యాప్తిని నిరోధించేందుకు వాటిని చంపడం ప్రారంభించారు.