సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు వ్యవహారంలో ఈడీ దర్యాప్తు
దిశ, శేరిలింగంపల్లి : సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే స్థిరాస్తి వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడ్డారని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో 7 కేసులు, నార్సింగి, రాయదుర్గం పీఎస్ ల్లోనూ కేసులు నమోదయ్యాయి. బెయిల్ పై బయటకు వచ్చిన శ్రీధర్ రావు అప్పటి నుంచి కనపడకుండా పోయారు. ఆయన వ్యవహారంపై తాజాగా ఈడీ దృష్టి సారించింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా […]
దిశ, శేరిలింగంపల్లి : సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే స్థిరాస్తి వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడ్డారని పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసుస్టేషన్‌లో 7 కేసులు, నార్సింగి, రాయదుర్గం పీఎస్ ల్లోనూ కేసులు నమోదయ్యాయి. బెయిల్ పై బయటకు వచ్చిన శ్రీధర్ రావు అప్పటి నుంచి కనపడకుండా పోయారు. ఆయన వ్యవహారంపై తాజాగా ఈడీ దృష్టి సారించింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ, మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వందల కోట్ల సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో శ్రీధర్ రావు ఆస్తులు కొన్నట్టు ఈడీ అనుమానిస్తోంది.