వివాదంలో రైల్వేశాఖ.. రామాయణ ఎక్స్ ప్రెస్ లో వెరైటీ సాధువులు..
దిశ, వెబ్ డెస్క్ : రామాయణ సర్క్యూట్ స్పెషల్ ట్రైన్ లో డ్రెస్ కోడ్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా రైల్వేశాఖ ఈ ట్రైన్ ను ప్రారంభించింది. ‘దేఖో అప్నా దేశ్’ కింద ఏసీ డీలక్స్ ట్రైన్ ను ఐఆర్సీటీసీ ప్రారంభించింది. ఈ ట్రైన్ సఫ్దర్ జంగ్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి దాదాపు దేశంలో 7,500 కి.మీ ప్రయాణించి తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది. అయితే ఈ ట్రైన్ లో ఆహారాన్ని అందించడానికి […]
దిశ, వెబ్ డెస్క్ : రామాయణ సర్క్యూట్ స్పెషల్ ట్రైన్ లో డ్రెస్ కోడ్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా రైల్వేశాఖ ఈ ట్రైన్ ను ప్రారంభించింది. ‘దేఖో అప్నా దేశ్’ కింద ఏసీ డీలక్స్ ట్రైన్ ను ఐఆర్సీటీసీ ప్రారంభించింది. ఈ ట్రైన్ సఫ్దర్ జంగ్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి దాదాపు దేశంలో 7,500 కి.మీ ప్రయాణించి తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది. అయితే ఈ ట్రైన్ లో ఆహారాన్ని అందించడానికి వెయిటర్లకు వినూత్న డ్రెస్ కోడ్ పెట్టారు. అయితే సాధువులను పోలిన ఈ డ్రెస్ కోడ్ లో రుద్రాక్షలు, తలకు పాగా ధరించి, ప్రయాణీకులకు సేవలు అందిస్తున్నారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే సరికి వివిధ హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
వెయిటర్ లకు సాధువుల డ్రెస్ కోడ్ పెట్టడాన్ని అఖాడా పరిషత్ సీరియస్ గా తీసుకుంది. ఇది హిందూ సంప్రదాయాలకు విరుద్దం అని, సాదు సంతువులను అవమానించడమేనని అఖాడా మాజీ ప్రధాన కార్యదర్శి పరమ హంస అవధేశ్ పురి అన్నారు. వెంటనే ఈ పద్దతిని మార్చాలని రైల్వే శాఖకు లేఖ రాశారు. మార్చకపోతే రామాయణ సర్క్యూట్ రైలును ఢిల్లీలోనే అడ్డుకుంటామని హెచ్చరించారు. దాంతో రైల్వేశాఖ స్పందించి డ్రెస్ కోడ్ ను మార్చేసింది. అయితే తలపాగ, చేతికి కాషాయ వస్త్రాలు మాత్రం అలానే ఉంచి చొక్కా, పాయింట్ ను అందించాయి.