బద్వేలులో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యం : పరిపూర్ణానంద స్వామి
దిశ, ఏపీ బ్యూరో: బద్వేలులో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణ నందస్వామి విమర్శించారు. బద్వేలులో రోడ్లు అడుగడునా గుంతలమయంగా మారాయని వ్యాఖ్యానించారు. బద్వేలులో ఉప ఎన్నికలో సోమవారం పరిపూర్ణనంద బీజేపీ తరపున ప్రచారం చేశారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బద్వేలు అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. సీఎం జగన్ బద్వేలు అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. కొన్ని పార్టీలు సంప్రదాయం పాటిస్తున్నామని ఎన్నికల్లో […]
దిశ, ఏపీ బ్యూరో: బద్వేలులో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని శ్రీ పీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణ నందస్వామి విమర్శించారు. బద్వేలులో రోడ్లు అడుగడునా గుంతలమయంగా మారాయని వ్యాఖ్యానించారు. బద్వేలులో ఉప ఎన్నికలో సోమవారం పరిపూర్ణనంద బీజేపీ తరపున ప్రచారం చేశారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బద్వేలు అభివృద్ధి చెందాలంటే అది బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. సీఎం జగన్ బద్వేలు అభివృద్ధిని విస్మరించారని ఆరోపించారు. కొన్ని పార్టీలు సంప్రదాయం పాటిస్తున్నామని ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టలేదని బీజేపీ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించదని నిబద్ధతతో రాజకీయాలు చేస్తుందని స్వామీజీ వివరించారు. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమే అని స్పష్టం చేశారు. కుటుంబంలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబంలో వ్యక్తినే ఎన్నుకోవాలనుకోవడం సరికాదన్నారు. బద్వేలు బీజేపీ అభ్యర్థి పనతల సురేష్ విద్యార్థి దశ నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగారని అభివృద్దిపై రాజీ లేకుండా పని చేస్తారని స్పష్టం చేశారు. అసెంబ్లీలో రాష్ట్ర అభివృద్ధి, బద్వేలు సమస్యలపై మాట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకువచ్చే వ్యక్తి సురేష్ అని ఆయనను గెలిపించాలని పరిపూర్ణ నందస్వామి కోరారు.