ఒకవైపు ఆందోళన.. మరోవైపు ఆనందం
దిశ, ఏపి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్నది. అయితే గడచిన 24 గంటల్లో ఇంత వరకు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోన్నది. మరోవైపు ఏపీలో డిశ్చార్జ్ కేసుల సంఖ్య పెరగడం వైద్య ఆరోగ్య శాఖలో ధైర్యాన్ని పెంచుతోన్నది. కాగా, గడిచిన 24 గంటల్లో ఏపీలో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 2205 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో […]
దిశ, ఏపి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోన్నది. అయితే గడచిన 24 గంటల్లో ఇంత వరకు కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోన్నది. మరోవైపు ఏపీలో డిశ్చార్జ్ కేసుల సంఖ్య పెరగడం వైద్య ఆరోగ్య శాఖలో ధైర్యాన్ని పెంచుతోన్నది. కాగా, గడిచిన 24 గంటల్లో ఏపీలో 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు 2205 కరోనా కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో చిత్తూరులో 8, గుంటూరులో 9, కడపలో 1, కృష్ణా జిల్లాలో 7, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో 9, విశాఖపట్నంలో 4, పశ్చిమ గోదావరిలో 1 కేసు మొత్తం 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. ఇందులో కర్నూలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో నమోదైన అన్ని కేసులు, వైజాగ్‌లో రెండు, గుంటూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నమోదైన ఒక్కో కేసు మొత్తం 31 కేసులు తమిళనాడు రాజధాని చెన్నైలోని కోయంబేడు మార్కెట్ నుంచి వచ్చినవేనని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 2205 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 803 యాక్టివ్ కేసుల బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొంది 1353 మంది కోలుకున్నారు. మరో 49 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. డిశ్చార్జీల సంఖ్య పెరుగుతుండడం పట్ల వైద్య ఆరోగ్య శాఖ హర్షం వ్యక్తం చేస్తోన్నది.