అక్కడ పురుషులు చీరలు ధరించి ‘గర్బా’ నృత్యం చేస్తారు.. ఎందుకో తెలుసా?
దిశ, ఫీచర్స్ : నవరాత్రి సమయంలో గుజరాత్‌లో ‘గర్బా’ నృత్యం చేయడం ఆనాదిగా వస్తోంది. సంప్రదాయ బట్టలు ధరించిన మహిళలు అమ్మవారి పాటలపై గర్బా ప్రదర్శిస్తుంటే, పురుషులు కూడా వారితో నృత్యం చేయడం కనిపిస్తుంది. అయితే అహ్మదాబాద్‌లో కూడా 200ఏళ్ల పురాతన సంప్రదాయాన్ని కొనసాగించేందుకు అక్కడి పురుషులు చీర కట్టుకుని గర్బా చేస్తారని తెలుసా? ఇలాంటి దృశ్యాన్ని బాలీవుడ్ మూవీ ‘స్త్రీ’ చిత్రంలో చూసుంటారు. కానీ పురుషులు చీరను ధరించే ఆచారం నిజ జీవితంలో కూడా జరుగుతోంది. […]
దిశ, ఫీచర్స్ : నవరాత్రి సమయంలో గుజరాత్‌లో ‘గర్బా’ నృత్యం చేయడం ఆనాదిగా వస్తోంది. సంప్రదాయ బట్టలు ధరించిన మహిళలు అమ్మవారి పాటలపై గర్బా ప్రదర్శిస్తుంటే, పురుషులు కూడా వారితో నృత్యం చేయడం కనిపిస్తుంది. అయితే అహ్మదాబాద్‌లో కూడా 200ఏళ్ల పురాతన సంప్రదాయాన్ని కొనసాగించేందుకు అక్కడి పురుషులు చీర కట్టుకుని గర్బా చేస్తారని తెలుసా? ఇలాంటి దృశ్యాన్ని బాలీవుడ్ మూవీ ‘స్త్రీ’ చిత్రంలో చూసుంటారు. కానీ పురుషులు చీరను ధరించే ఆచారం నిజ జీవితంలో కూడా జరుగుతోంది. మరి వాళ్లెందుకు చీర కట్టుకుంటారు? గర్బా చేయడం వెనుక వారి సంప్రదాయం ఏమిటి?
అహ్మదాబాద్‌లోని ఓల్డ్ సిటీలో నివసించే ‘బారోట్ కమ్యూనిటీ’ ప్రజలు ‘సదుబా మాత’ను పూజిస్తారు. అష్టమి రోజున ఇక్కడి పురుషులు చీరలు ధరించి గర్బా చేస్తారు. ఇది బారోట్ కమ్యూనిటీ ప్రజలు దేవత పట్ల తమ కృతజ్ఞతను తెలియజేసే సంప్రదాయం. వారి కోరికలు నెరవేరడానికి పురుషులు మహిళల దుస్తులలో ఇక్కడ నృత్యం చేస్తారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా వారి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, దీర్ఘాయువుతో నిండునూరేళ్లు సంతోషంగా బతకాలని వారు ప్రార్థిస్తారు.
ఈ ప్రత్యేకమైన గర్బా పండుగను అహ్మదాబాద్ అంతటా ‘షెరీ గర్బా’ అని పిలుస్తారు. సుమారు 200 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో నివసించిన ‘సదుబా’ అనే మహిళ ఆమె గౌరవాన్ని కాపాడటానికి సహాయం చేయమని ప్రాధేయపడగా, వాళ్లు నిరాకరించినప్పుడు సదుబా లేదా సదుబెన్ ఆ ప్రాంతంలోని పురుషులను శపించిందని స్థానికులు నమ్ముతున్నారు. దీనికి ప్రాయశ్చిత్తంగా పురుషులు చీరలు ధరించి గర్బా చేస్తారని స్థానికులు చెబుతున్నారు. దీంతో ‘సదు మాత’ పేరుతో ఒక దేవాలయం నిర్మించి, ప్రతి ఏటా నవరాత్రుల్లో ఇక్కడ పురుషులు చీరలు ధరించి ప్రార్థనలు చేసి, దేవతను క్షమాపణ కోరుకుంటారు.