బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన CPM
దిశ, సిద్దిపేట: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పడం ఎంత సమంజసమని సీపీఎం జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రాములు టీఆర్ఎస్ సర్కార్‌ను పశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో బేరసారాలు మాని పోరాటం చేయాలని, అప్పుడే రైతులకు ఉపయోగం జరుగుతుందని సూచించారు. గత రెండ్రోజులుగా కొనసాగుతోన్న సీపీఎం జిల్లా మహాసభల ముగింపు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన […]
దిశ, సిద్దిపేట: రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా, ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెప్పడం ఎంత సమంజసమని సీపీఎం జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నాగయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చుక్కా రాములు టీఆర్ఎస్ సర్కార్‌ను పశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో బేరసారాలు మాని పోరాటం చేయాలని, అప్పుడే రైతులకు ఉపయోగం జరుగుతుందని సూచించారు. గత రెండ్రోజులుగా కొనసాగుతోన్న సీపీఎం జిల్లా మహాసభల ముగింపు కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలు రద్దు చేసి ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు.
అలాగే నూతన విద్యుత్ చట్టాన్ని కూడా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సిద్దిపేట జిల్లా మహాసభల సందర్భంగా పలు కీలక తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాల ఆధారంగా పక్కా కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు రమ, మల్లారెడ్డి, గోపాలస్వామి, శశిధర్ పాల్గొన్నారు.