ఆన్‌లైన్‌లో పెళ్లిళ్లు.. అప్డేట్ అయిన పంతుళ్లు
దిశ ప్రతినిధి, మెదక్ : ప్రస్తుతం కరోనా అందరికి టెక్నాలజీని పరిచయం చేస్తుంది. చిన్న పిల్లల మొదలు వృద్ధుల వరకు టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారు. అదే బాటలోకి పంతుళ్లు వచ్చారు. పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ నెలలో చాలా మంది పెళ్లి చేసుకోడానికి రెడీ అయ్యారు. అయితే ప్రతి గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే పెళ్లిళ్లు చేసేస్తున్నారు. ఇలా మెదక్ జిల్లాలో ఆన్లైన్ లో పురోహితుడు మంత్రాలు చదవగా… పెళ్లి […]
దిశ ప్రతినిధి, మెదక్ : ప్రస్తుతం కరోనా అందరికి టెక్నాలజీని పరిచయం చేస్తుంది. చిన్న పిల్లల మొదలు వృద్ధుల వరకు టెక్నాలజీని బాగా ఉపయోగిస్తున్నారు. అదే బాటలోకి పంతుళ్లు వచ్చారు. పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈ నెలలో చాలా మంది పెళ్లి చేసుకోడానికి రెడీ అయ్యారు. అయితే ప్రతి గ్రామంలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే పెళ్లిళ్లు చేసేస్తున్నారు.
ఇలా మెదక్ జిల్లాలో ఆన్లైన్ లో పురోహితుడు మంత్రాలు చదవగా… పెళ్లి జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే… మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అంబ్రియా పంచాయతీ పరిధిలోని సొమ్ల తండాకు చెందిన బానోత్ శివరాం కూతురు మంజూలకు, టేక్మాల్ మండలం భీమ్లా తండాకు చెందిన పాత్లోత్ మోహన్‌తో సోమవారం రోజున వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్లికూతురు గ్రామంలో ఓ యువకుడు కరోనాతో మృతి చెందాడు. దీంతో భయబ్రాంతులకు గురైన దిగంబర్ పంతులు తన నివాసం నుండే సెల్ ఫోన్ లో వేద మంత్రాలు చదవగా.. తండాలో ఉన్న పెద్దమనిషి సెల్ ఫోన్ మైకు వద్ద ఉంచారు. పురోహితుడు చెప్పిన విధంగా ఆ నూతన వధూవరులు ఒకటయ్యారు.