యూనిఫామ్‌లో ఉన్న కానిస్టేబుల్ అలా ఎందుకు చేశాడు?

దిశ, వెబ్ డెస్క్ : విధుల్లో ఉండాల్సిన కానిస్టేబుల్ విగత జీవిగా మారాడు. జిల్లా సరిహద్దులను దాటి వచ్చి విషాదాన్ని నింపాడు. నల్లగొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన యాచారం మండల కేంద్రంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా డిండి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున సైదులు(26 ) మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం కూడా విధులకు హాజరైన […]

Update: 2021-03-30 00:21 GMT
యూనిఫామ్‌లో ఉన్న కానిస్టేబుల్ అలా ఎందుకు చేశాడు?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : విధుల్లో ఉండాల్సిన కానిస్టేబుల్ విగత జీవిగా మారాడు. జిల్లా సరిహద్దులను దాటి వచ్చి విషాదాన్ని నింపాడు. నల్లగొండ జిల్లాకు చెందిన కానిస్టేబుల్ రంగారెడ్డి జిల్లాలో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన యాచారం మండల కేంద్రంలో మంగళవారం ఉదయం వెలుగు చూసింది. నల్లగొండ జిల్లా డిండి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన మల్లికార్జున సైదులు(26 ) మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం కూడా విధులకు హాజరైన ఆయన.. డ్యూటీ అనంతరం ఇంటికి వెళ్లాడు.

అయితే మంగళవారం ఉదయం రంగారెడ్డి జిల్లా యాచారం శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడి వివరాలు సేకరించాడు. కానిస్టేబుల్ యూనిఫామ్ లోనే ఆత్మహత్యకు పాల్పడడంతో బ్యాడ్జి నంబర్ ఆధారంగా మర్రిగూడ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు. కాగా విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన సైదులు.. కుటుంబ కలహాలతో ఉరి వేసుకున్నట్లు తోటి సిబ్బంది చెబుతున్నారు.

కానిస్టేబుల్ గత సంవత్సరం డిసెంబర్ 22 న మర్రిగూడ పోలీస్ స్టేషన్ లో ఉద్యోగంలో చేరాడు. 2020 నవంబర్ లోనే ఇతనికి వివాహం జరిగినట్లు తెలిసింది. అయితే ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానిస్టేబుల్ ఆత్మహత్యకు చేసుకోవడానికి రంగారెడ్డి జిల్లా వరకు రావడంపై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. యాచారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.

Tags:    

Similar News