CM Revanth Reddy: మెట్రో రైలు విస్తరణకు సహకరించండి.. మోడీకి సీఎం విజ్ఞప్తి
మెట్రో రైలు విస్తరణకు సహకరించండి.. మోడీకి సీఎం విజ్ఞప్తి చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: మెట్రో రైలు విస్తరణకు కేంద్రం సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీకి (Prime Minister Narendra Modi) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. కేంద్రం సహకరిస్తే తెలంగాణ ట్రిలియన్ ఎకామనీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapalli Railway Terminal) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..చర్లపల్లి టెర్మినల్ ప్రారంభిస్తున్నందుకు ప్రధానికి శుభాకాంక్షలు. డ్రైపోర్టు ఇవ్వాలని ప్రధానిని కోరుతున్నాను. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి సహకారం అందించండి.
దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత: మోడీ
దేశంలో కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఒక్కో ఒడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నామని చెప్పారు. మెట్రో నెట్ వర్క్ 1000 కి.మీ.కు పైగా పరిధి విస్తరించిందన్నారు. జమ్ముకశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు. మంగళవారం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్చువల్ గా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొనగా చర్లపల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.