తెలంగాణలో నూతనోత్సాహంతో దూసుకుపోతున్నా కాంగ్రెస్..

దిశ, జడ్చర్ల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతనోత్సాహంతో దూసుకుపోతుందని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. అందుకు నిదర్శనం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న డిజిటల్ సభ్యత్వ నమోదుకు స్వచ్ఛందంగా లక్షలాది గా మంది ముందుకు రావడం ఉదాహరణ అని  టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాయిన్ కాంగ్రెస్- సేవ్ ఇండియా […]

Update: 2021-12-13 08:14 GMT

దిశ, జడ్చర్ల: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నూతనోత్సాహంతో దూసుకుపోతుందని క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందన్నారు. అందుకు నిదర్శనం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చేపడుతున్న డిజిటల్ సభ్యత్వ నమోదుకు స్వచ్ఛందంగా లక్షలాది గా మంది ముందుకు రావడం ఉదాహరణ అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి అన్నారు. మిడ్జిల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ పద్ధతిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాయిన్ కాంగ్రెస్- సేవ్ ఇండియా అనే పేరుతో ఆన్లైన్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందన్నారు.

వచ్చే మార్చి 31 వరకు డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందని.. ఐదు రూపాయలు చెల్లించి ఓటర్ ఐడి ద్వారా కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం పొందవచ్చన్నారు. ప్రస్తుతం సభ్యత్వం తీసుకున్న వారందరి వివరాలు ఏఏసీ, టీపీసీ కి అనుసంధానమై ఉంటాయని చెప్పారు. డిజిటల్ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కాంగ్రెస్ పార్టీ కల్పించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లో చేర్పించి పార్టీని బలోపేతం చేయాల్సిందిగా మండల నాయకులకు మల్లు రవి సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, శంకర్ గౌడ్, పర్వతాలు, శివ, బీరయ్య పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News