సీఎం సారూ.. డీఎస్సీ-98 క్వాలిఫైడ్స్‌కు ఉద్యోగాలివ్వండి
దిశ, హైదరాబాద్: ప్రగతి భవన్ సాక్షిగా ఇచ్చిన స్పష్టమైన హామీ, కోర్టు అనుకూల తీర్పులను పరిగణనలోకి తీసుకొని డీఎస్సీ-98 క్వాలిఫైడ్ నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పిటిషన్ దారులు అందరికీ ఉద్యోగాలు కల్పించేలా కేబినేట్ నిర్ణయం తీసుకోవాలని 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కే.శ్రీనివాస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నిర్వహించనున్న మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీపై చర్చించనున్న నేపథ్యంలో డీఎస్సీ-98 […]
దిశ, హైదరాబాద్: ప్రగతి భవన్ సాక్షిగా ఇచ్చిన స్పష్టమైన హామీ, కోర్టు అనుకూల తీర్పులను పరిగణనలోకి తీసుకొని డీఎస్సీ-98 క్వాలిఫైడ్ నల్లగొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పిటిషన్ దారులు అందరికీ ఉద్యోగాలు కల్పించేలా కేబినేట్ నిర్ణయం తీసుకోవాలని 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కే.శ్రీనివాస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం నిర్వహించనున్న మంత్రిమండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీపై చర్చించనున్న నేపథ్యంలో డీఎస్సీ-98 సమస్య పరిష్కారంపై ఒక తీపికబురు ప్రకటన చేయాలని శ్రీనివాస్ కోరారు.