రైతులపై బలప్రయోగం తప్పలేదు: కేంద్ర హోం శాఖ

న్యూఢిల్లీ: గత నెల 26న పరిస్థితులను నియంత్రించడానికి రైతులపై స్వల్పమొత్తంలో బలప్రయోగం చేయకతప్పలేదని కేంద్ర హోం శాఖ పార్లమెంటులో వెల్లడించింది. ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం రోజున అల్లర్లుకు దిగారని, కరోనా కాలంలోనూ మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించారని లోక్‌సభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ఢిల్లీలో చాలా చోట్ల గందరగోళం సృష్టించారని, ఢిల్లీ పోలీసులనూ గాయపరిచారని వివరించారు. రైతుల చర్యలతో పోలీసులు రంగంలోకి దిగకతప్పలేదని పేర్కొన్నారు. వారిని అదుపులోకి తేవడానికి రైతులపై […]

Update: 2021-02-02 11:46 GMT

న్యూఢిల్లీ: గత నెల 26న పరిస్థితులను నియంత్రించడానికి రైతులపై స్వల్పమొత్తంలో బలప్రయోగం చేయకతప్పలేదని కేంద్ర హోం శాఖ పార్లమెంటులో వెల్లడించింది. ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం రోజున అల్లర్లుకు దిగారని, కరోనా కాలంలోనూ మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరించారని లోక్‌సభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. ఢిల్లీలో చాలా చోట్ల గందరగోళం సృష్టించారని, ఢిల్లీ పోలీసులనూ గాయపరిచారని వివరించారు. రైతుల చర్యలతో పోలీసులు రంగంలోకి దిగకతప్పలేదని పేర్కొన్నారు. వారిని అదుపులోకి తేవడానికి రైతులపై టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు, స్వల్పమొత్తంలో బలప్రయోగం చేపట్టక తప్పలేదని వివరించారు. ఇప్పటి వరకు 39 కేసులు నమోదుచేశామని పోలీసులు తెలిపినట్టు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News