క్వారంటైన్ కేంద్రం తాళాలు పగులగొట్టి పరారీ

కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం తాళాలు విరగ్గొట్టి ఇద్దరు వ్యక్తులు పరారవ్వడం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా కోదాడకి చెందిన మక్కా వెంకటేశ్వరరావు (33), నరసమ్మ (30) నాలుగు రోజుల క్రితం మైలవరంలోని బంధువుల ఇంటికి వచ్చారు. దీంతో స్థానిక వలంటీర్ సమాచారంతో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈ ఉదయం తెల్లవారు జామున వారిద్దరూ క్వారంటైన్ కేంద్రం వెనుక గేట్ తాళం పగులగొట్టి పరారైనట్టు […]

Update: 2020-04-23 07:52 GMT

కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం తాళాలు విరగ్గొట్టి ఇద్దరు వ్యక్తులు పరారవ్వడం కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా కోదాడకి చెందిన మక్కా వెంకటేశ్వరరావు (33), నరసమ్మ (30) నాలుగు రోజుల క్రితం మైలవరంలోని బంధువుల ఇంటికి వచ్చారు. దీంతో స్థానిక వలంటీర్ సమాచారంతో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

ఈ ఉదయం తెల్లవారు జామున వారిద్దరూ క్వారంటైన్ కేంద్రం వెనుక గేట్ తాళం పగులగొట్టి పరారైనట్టు సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో దర్యాప్తు ఆరంభించారు. కాగా వారిద్దరూ తెలంగాణలోని కోదాడ పట్టణానికి చేరినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందువల్ల వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

tags:krishna district, mylavaram, quarantine center, kodad

Tags:    

Similar News