సోదరి ఇంటికి వచ్చిన అన్న అదృశ్యం
దిశ, కూకట్పల్లి: బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ టౌన్షిప్లో నివాసం ఉంటున్న తన సోదరిని కలవడానికి వచ్చిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. బాలానగర్ సీఐ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన కే. నర్సింహా(63) ఈ నెల 13న బాలానగర్ హెచ్ఏఎల్ఉద్యోగి అయిన తన సోదరి పద్మ ఇంటికి వచ్చాడు. 27వ తేదిన ఉదయం 11 గంటల ప్రాంతంలో మెడికల్ షాప్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టు […]
దిశ, కూకట్పల్లి: బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హెచ్ఏఎల్ టౌన్షిప్లో నివాసం ఉంటున్న తన సోదరిని కలవడానికి వచ్చిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. బాలానగర్ సీఐ వహీదుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన కే. నర్సింహా(63) ఈ నెల 13న బాలానగర్ హెచ్ఏఎల్ఉద్యోగి అయిన తన సోదరి పద్మ ఇంటికి వచ్చాడు. 27వ తేదిన ఉదయం 11 గంటల ప్రాంతంలో మెడికల్ షాప్‌కు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు.
చుట్టు పక్కల గాలించిన ఫలితం లేకపోవడంతో బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన సమయంలో నీలం రంగు షర్టు, గోధుమ రంగు లుంగీ, ఎరుపు రంగు మాస్కు ధరించి ఉన్నాడని, ఆచూకీ తెలిసిన వారు బాలానగర్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు.