జనసేనతో బీజేపీకి పొత్తు ఉంటుంది

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో జనసేన పార్టీతో బీజేపీకి పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. బద్వేలు ఉపఎన్నికల్లో జనసేన పోటీ నుంచి విరమించుకున్నప్పటికీ తాము మాత్రం పోటీ చేసి తీరతామని వెల్లడించారు. బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అయితే పవన్ వస్తారా లేదా అనేది ఆయన ఇష్టమని చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్‌పై మంత్రులు, వైసీపీ నేతలు […]

Update: 2021-10-04 10:48 GMT

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో జనసేన పార్టీతో బీజేపీకి పొత్తు ఖచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. బద్వేలు ఉపఎన్నికల్లో జనసేన పోటీ నుంచి విరమించుకున్నప్పటికీ తాము మాత్రం పోటీ చేసి తీరతామని వెల్లడించారు. బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానిస్తామని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. అయితే పవన్ వస్తారా లేదా అనేది ఆయన ఇష్టమని చెప్పుకొచ్చారు. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్‌పై మంత్రులు, వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. విమర్శలు చేసే సమయంలో గౌరవప్రదమైన భాషను ఉపయోగించాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం, కులాలను రాజకీయాల్లోకి లాగడం వంటివి చేయడం సరికాదని హితవు పలికారు. టీడీపీ, జనసేన పార్టీలు మళ్లీ దగ్గరవుతున్నాయనే ప్రచారం జరుగుతుందని.. దీనిపై ఇప్పుడే సమాధానం చెప్పలేనని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు.

Tags:    

Similar News