డీసీపీతో మాట్లాడిన గట్టు నాగమణి.. ఆడియో లీక్
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి డీసీపీ రవీందర్‌తో హైకోర్టు న్యాయవాది పీవి.నాగమణి మాట్లాడిన ఆడియో లీక్ అయింది. మంథని మండలం గుంజపడుగ గ్రామంలోని రామాలయం విషయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె డీసీపీతో వాపోయింది. సీపీకి, 100 డయల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కుంట శ్రీను అనే వ్యక్తి జోక్యం చేసుకోవడంతో గొడవలు జరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె డీసీపీని కోరింది. అయితే డీసీపీ మాత్రం సర్పంచ్ […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి డీసీపీ రవీందర్‌తో హైకోర్టు న్యాయవాది పీవి.నాగమణి మాట్లాడిన ఆడియో లీక్ అయింది. మంథని మండలం గుంజపడుగ గ్రామంలోని రామాలయం విషయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె డీసీపీతో వాపోయింది. సీపీకి, 100 డయల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
కుంట శ్రీను అనే వ్యక్తి జోక్యం చేసుకోవడంతో గొడవలు జరుగుతున్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆమె డీసీపీని కోరింది. అయితే డీసీపీ మాత్రం సర్పంచ్ సంబంధిత అదికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోరని డీసీపీ చెప్పారు. అడ్వకేట్ నాగమణి, డీసీపీకి సంబంధించిన ఈ ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆడియో సంభాషణ వినాలంటే కింద ఉన్న ఆడియో క్లిప్ పై క్లిక్ చేయండి.