ఆ చట్టంలోని అంశాలు ఆచరణ సాధ్యం కాదు: హరీశ్ రావు

దిశ, వెబ్ డెస్క్: కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తూప్రాన్‌లో టీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. రైతులకు మద్దతుగా యావత్ దేశం రోడ్డెక్కిందని అన్నారు. రైతు చట్టాలపై బ్రిటన్ ప్రధాని స్పందించినా, మోదీ స్పందించడం లేదని చెప్పారు. కార్పొరేట్ చట్టంతో రైతు కూలీగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల ఆత్మగౌరవం దెబ్బ తింటుందని తెలిపారు. రైతులకు మద్దతు ధర లేకుండా […]

Update: 2020-12-08 04:57 GMT

దిశ, వెబ్ డెస్క్: కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. తూప్రాన్‌లో టీఆర్ఎస్ మహాధర్నా కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. రైతులకు మద్దతుగా యావత్ దేశం రోడ్డెక్కిందని అన్నారు. రైతు చట్టాలపై బ్రిటన్ ప్రధాని స్పందించినా, మోదీ స్పందించడం లేదని చెప్పారు.

కార్పొరేట్ చట్టంతో రైతు కూలీగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల ఆత్మగౌరవం దెబ్బ తింటుందని తెలిపారు. రైతులకు మద్దతు ధర లేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. రైతు చట్టంలోని అంశాలు ఆచరణలో సాధ్యం కాదని వివరించారు.

Tags:    

Similar News