ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల రీసర్వేకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి వ్యక్తికీ ఆధార్ నెంబర్ ఉన్నట్టుగా ప్రతి ల్యాండ్ బిట్‌కు భూదార్ నెంబర్ కేటాయించి, కంటిన్యూయస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) ద్వారా భూముల రీసర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి జీవో జారీ చేశారు. రీసర్వే ఫేజ్ 1, ఫేజ్ 2 కోసం […]

Update: 2020-06-03 05:42 GMT

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూముల రీసర్వేకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి వ్యక్తికీ ఆధార్ నెంబర్ ఉన్నట్టుగా ప్రతి ల్యాండ్ బిట్‌కు భూదార్ నెంబర్ కేటాయించి, కంటిన్యూయస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) ద్వారా భూముల రీసర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి జీవో జారీ చేశారు. రీసర్వే ఫేజ్ 1, ఫేజ్ 2 కోసం 65 బేస్ స్టేషన్లు, కంట్రోల్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఈరోజు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని డైరెక్టర్ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో భూములు రీసర్వే చేయడానికి రూ. 200 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గత టీడీపీ హయాంలో కూడా భూదార్ కార్యక్రమం కోసం పైలట్ ప్రాజెక్టుగా రూ. 3.20 కోట్లు ఖర్చు చేశారు. తక్కువ ఖర్చుతో కొలతల్లో ఏమాత్రం లోపం లేని విధంగా రీసర్వే పనులు చేపట్టాలని రెవెన్యూ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. పైలట్ ప్రాజెక్టుగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రీసర్వే ప్రాజెక్టు అమలు చేయనున్నారు.

Tags:    

Similar News