భారత్ కంటేపాక్ నయం.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ విమర్శలు చేశారు. కొవిడ్-19 విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రధానికి పలుమార్లు హెచ్చరించింది. అయినప్పటికీ ఆయన పట్టించుకోలేదని చెప్పారు. కరోనాకు సంబంధించి కేంద్రం సరైన చర్యలు తీసుకోలేదనే విషయాన్ని ప్రజలు గుర్తించారని, దీనిప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని రాహుల్ గాంధీ అనేకసార్లు హెచ్చరించారని, అయినా సరే ప్రధానీ పెడచెవిన పెట్టారని విమర్శలు చేశారు. “కరోనాను నియంత్రించడంలో భారత్ […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ శశిథరూర్ విమర్శలు చేశారు. కొవిడ్-19 విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రధానికి పలుమార్లు హెచ్చరించింది. అయినప్పటికీ ఆయన పట్టించుకోలేదని చెప్పారు. కరోనాకు సంబంధించి కేంద్రం సరైన చర్యలు తీసుకోలేదనే విషయాన్ని ప్రజలు గుర్తించారని, దీనిప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని రాహుల్ గాంధీ అనేకసార్లు హెచ్చరించారని, అయినా సరే ప్రధానీ పెడచెవిన పెట్టారని విమర్శలు చేశారు.
“కరోనాను నియంత్రించడంలో భారత్ కంటే పాకిస్తాన్ చాలా మెరుగ్గా వ్యవహరించిందని” లాహోర్ లిట్ ఫెస్ట్ వర్చువల్ సమావేశంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే, బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్న ముస్లింలలో అభద్రతాభావం పెరిగేలా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వివక్షలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌ను ప్రశంసించడం ఏంటని విమర్శించారు. శతృదేశానికి మద్దతుగా మాట్లాడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.