TG High Court: నగరవాసులకు భారీ గుడ్ న్యూస్.. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హుస్సేన్ సాగర్‌‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధించాలంటూ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Update: 2024-09-10 10:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: హుస్సేన్ సాగర్‌‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధించాలంటూ మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన ధర్మాసనం హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలు వద్దని పిటిషనర్ తన వాదనలు వినిపించారు.  గతేడాది ఇచ్చిన తీర్పునే ఈసారి కొనసాగించాలని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా ‘హైడ్రా’ను కూడా ఇందులో ప్రతివాదిగా చేర్చాలని కోరారు. పూర్తి వాదనలు విన్న ధర్మాసనం గత ఆదేశాల సమయంలో ‘హైడ్రా’ లేదని ఇప్పుడెలా ప్రతివాదిగా ఆ సంస్థను చేరుస్తామని ఆక్షేపించింది. చివరి నిమిషంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు తప్పుబట్టింది. అదేవిధంగా ఆ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు లైన్ క్లియర్ అయింది.


Similar News