Breaking: పీసీ ఘోష్ కమిషన్ విచారణలో హరీశ్ రావు పేరు

కాళేశ్వరం కమిషన్ విచారణలో సీఈ సుధాకర్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు.

Update: 2024-10-26 10:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం (Kaleswaram Project) అంశంలో ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Pc Ghosh Commission) బహిరంగ విచారణ కొనసాగుతున్నది. శనివారం జరిగిన విచారణకు సీఈ సుధాకర్ రెడ్డి (Ce Sudhakar Reddy)  హాజరయ్యారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల టెండర్లపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపింది. తనిఖీలు లేకుండానే మేడిగడ్డ బ్యారేజీకి సబ్ స్టాన్షియల్ పత్రం ఇచ్చినట్లు సుధాకర్ రెడ్డి అంగీకరించారు. డీపీఆర్ ప్రకారం కాఫర్ డ్యామ్ కు డబ్బులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. మేడిగడ్డ డిజైన్ ఖరారు సమయంలో ఎల్ అండ్ టీని సంప్రదించినట్లు చెప్పారు. ఈ విచారణ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) పేరు మూడు సార్లు ప్రస్తావనకు వచ్చింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి ఎవరని కమిషన్ ప్రశ్నించగా హరీశ్ రావు అని సుధాకర్ సమాధానం ఇచ్చారు. హరీశ్ రావు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు టెండర్ల ప్రాసెస్ జరిగిందా అని ప్రశ్నించగా టెండరింగ్ ప్రాసెస్ జరగలేదని ఈసీ సుధాకర్ రెడ్డి బదులిచ్చారు. హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఫీల్డ్ లో జరిగిన టెస్టుల రికార్డులను వ్యాప్కొస్ సంస్థకు ఇవ్వమన ఆదేశించారని చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఫైనల్ బిల్లులు ఎందుకు ఆలస్యమయ్యాయని కమిషన్ ప్రశ్నించింది. అన్నారం, సుందిళ్ల ఫైనల్ బిల్లులను నిర్మాణ సంస్థలు ఇచ్చాయని మేడిగడ్డ బ్యారేజీ పైనల్ బిల్లులు ఇంకా సబ్మిట్ చేయలేదని చెప్పారు. కాళేశ్వరం కార్పొరేషన్ కు ఎలాంటి ఆదాయం లేదని చెప్పిన సుధాకర్ రెడ్డి.. వరద వేగాన్ని అంచనా వేయకపోవడం వల్లే బ్లాకులు దెబ్బతిన్నాయన్నారు.

Tags:    

Similar News