DGP: పోలీసుల ఆందోళన వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తం ఉండొచ్చు:డీజీపీ

స్పెషల్ పోలీసులు ఆందోళనలపై డీజీపీ స్పందించారు.

Update: 2024-10-26 09:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బెటాలియన్ పోలీసుల (battalion Police) ఆందోళనలపై తెలంగాణ డీజీపీ (Telangna DGP) స్పందించారు. క్రమశిక్షణ గల ఫోర్స్ లో ఉండి ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగాలు చేస్తూ మీ డిమాండ్ల కోసం పోరాటం చేయాలని మీ డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని సూచించారు. ఎంతో కాలం నుంచి రిక్రూట్ మెంట్ ప్రక్రియ సజావుగా సాగుతోందని మన దగ్గర ఉన్న రిక్రూట్మెంట్ వ్యవస్థనే అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. పోలీసుల ఆందోళన వెనుక ప్రభుత్వం వ్యతిరేక శక్తుల హస్తం ఉందనే అనుమానం ఉందని డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ ఉల్లంఘనే అన్నారు. సెలవులపై పాత పద్ధతిని అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళనకు దిగడంపై సీరియస్ అయ్యారు.

Read More : కొత్త డీజీపీ పొంగులేటికి శుభాకాంక్షలు’.. కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Tags:    

Similar News