లిప్‌బామ్ కలెక్షన్స్‌తో.. గిన్నిస్ రికార్డ్!
దిశ, వెబ్‌డెస్క్ : వాతావరణం ఎలా ఉన్నా.. ఎప్పుడైనా, ఎక్కడైనా.. పెదవులకు కాస్త లిప్‌బామ్ రాసుకోవడం చాలా మందికి అలవాటే. అమ్మాయిలైతే తప్పనిసరిగా లిప్‌బామ్ క్యారీ చేస్తుంటారు. ఇక చలికాలంలో పెదాల సంరక్షణకు లిప్ బామ్ ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పాల్సిన పనిలేదు. కానీ ‘లిప్‌బామ్’తోనూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించవచ్చనే విషయం తెలుసా? టెక్సాస్‌కు చెందిన చెల్సియా జెరాబెక్‌కు ‘లిప్‌బామ్’ పెదాలకు రాసుకోవడమంటే.. భలే సరదా. ఏదైనా కొత్త ప్రాంతానికి లేదా ఎక్కడికైనా […]
దిశ, వెబ్‌డెస్క్ : వాతావరణం ఎలా ఉన్నా.. ఎప్పుడైనా, ఎక్కడైనా.. పెదవులకు కాస్త లిప్‌బామ్ రాసుకోవడం చాలా మందికి అలవాటే. అమ్మాయిలైతే తప్పనిసరిగా లిప్‌బామ్ క్యారీ చేస్తుంటారు. ఇక చలికాలంలో పెదాల సంరక్షణకు లిప్ బామ్ ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పాల్సిన పనిలేదు. కానీ ‘లిప్‌బామ్’తోనూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించవచ్చనే విషయం తెలుసా?
టెక్సాస్‌కు చెందిన చెల్సియా జెరాబెక్‌కు ‘లిప్‌బామ్’ పెదాలకు రాసుకోవడమంటే.. భలే సరదా. ఏదైనా కొత్త ప్రాంతానికి లేదా ఎక్కడికైనా షాపింగ్‌కు వెళ్లినా.. అక్కడ దొరికే లిప్‌బామ్‌లను కొనకుండా ఉండలేదు. ఆమె తనకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ‘లిప్‌బామ్’లను కలెక్ట్ చేస్తూనే ఉంది. అలా చెల్సియా ఇప్పటివరకు 1800 భిన్నమైన లిప్‌బామ్‌లు సేకరించింది. ఈ అలవాటే ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి పెట్టింది. అయితే.. చెల్సియా సేకరించిన 1800 పీసెస్‌లో కొన్ని డూప్లికేట్ కంపెనీలు ఉండటంతో వాటిని కౌంట్ చేయలేదు. మొత్తంగా 1622 లిప్‌బామ్‌లను గిన్నిస్ పరిగణలోకి తీసుకుంది. చెల్సియా తన ఇంట్లో ఓ సెల్ఫ్‌ను వీటికోసమే ప్రత్యేక కేటాయించి, వాటిని అందంగా అలంకరించడం విశేషం.