ముంబైలో మొదటి షోరూమ్ ప్రారంభించే యోచనలో టెస్లా!
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ దిగ్గజ ఎలక్ట్రిక్ వాహాల ఉత్పత్తి సంస్థ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియాలో తన మొదటి షో-రూమ్‌ను ఆర్థిక రాజధాని ముంబైలోని పారెల్-వర్లిలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో 40 వేల చదరపు అడుగుల స్థలంలో ఆఫీస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అయితే, టెస్లా కార్ల ఉత్పత్తి బెంగళూరులోనే ఉండనుంది. ఈ మధ్యే టెస్లా కంపెనీలో కీలక ఉద్యోగులను నియమించింది. బెంగళూరులోని ఐఐఎం విద్యార్థి మనూజ్ ఖురానాను […]
దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ దిగ్గజ ఎలక్ట్రిక్ వాహాల ఉత్పత్తి సంస్థ టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇండియాలో తన మొదటి షో-రూమ్‌ను ఆర్థిక రాజధాని ముంబైలోని పారెల్-వర్లిలో ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో 40 వేల చదరపు అడుగుల స్థలంలో ఆఫీస్‌ను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. అయితే, టెస్లా కార్ల ఉత్పత్తి బెంగళూరులోనే ఉండనుంది.
ఈ మధ్యే టెస్లా కంపెనీలో కీలక ఉద్యోగులను నియమించింది. బెంగళూరులోని ఐఐఎం విద్యార్థి మనూజ్ ఖురానాను భారత్‌లోని కార్యకలాపాల కోసం పాలసీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ హెడ్‌గా నియమించింది. అదేవిధంగా ఛార్జింగ్ మేనేజర్‌గా నిశాంత్ ప్రసాద్‌ను ఎంచుకుంది. నిశాంత్ ఇదివరకు దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం ఆథర్ ఎనర్జీ సంస్థలో పనిచేశారు. కాగా, టెస్లా భారత్‌లో తన మూడు మోడల్ వేరియంట్లను ముందుగా తీసుకురానుంది.