కర్ణాటకలో ‘టెస్లా’ ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరుగాంచిన ఎలన్ మస్క్ (టెస్లా మోటార్స్) అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని కర్ణాటక రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం అధికారికంగా ప్రకటించారు. గత నెలలో టెస్లా మోటార్స్ అనుబంధ సంస్థగా ‘టెస్లా ఇండియా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. బెంగళూరులో ఏర్పాటుకానున్న ఈ యూనిట్‌కు వైభవ్ తనెజా, […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుగా పేరుగాంచిన ఎలన్ మస్క్ (టెస్లా మోటార్స్) అధినేత కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని కర్ణాటక రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప శనివారం అధికారికంగా ప్రకటించారు.
గత నెలలో టెస్లా మోటార్స్ అనుబంధ సంస్థగా ‘టెస్లా ఇండియా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరిట రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. బెంగళూరులో ఏర్పాటుకానున్న ఈ యూనిట్‌కు వైభవ్ తనెజా, వెంకట్రంగమ్ శ్రీరామ్ మరియు డేవిడ్ జాన్ ఫీన్స్టెన్ అనే ముగ్గురు డైరెక్టర్లుగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.