అమెరికాలో కొనసాగుతున్న ఉత్కంఠ

దిశ, వెబ్‎డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల జాప్యంతో ట్రంప్, జో బైడెన్ వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య నిరసనలు వెలువెత్తుతున్నాయి. కీలకమైన మిషిగాన్ రాష్ట్రంలో జో బైడెన్ గెలుపొందారు. ఇక నెవాడాలో హోరాహోరీ పోరు సాగుతోంది. ఇప్పటికి 86 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. అందులో బైడెన్ 49.3 శాతం, ట్రంప్ 48.7 శాతం ఓట్లు నమోదయ్యాయి. నెవెడాలో […]

Update: 2020-11-05 21:03 GMT

దిశ, వెబ్‎డెస్క్:
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల జాప్యంతో ట్రంప్, జో బైడెన్ వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో ట్రంప్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య నిరసనలు వెలువెత్తుతున్నాయి. కీలకమైన మిషిగాన్ రాష్ట్రంలో జో బైడెన్ గెలుపొందారు. ఇక నెవాడాలో హోరాహోరీ పోరు సాగుతోంది. ఇప్పటికి 86 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. అందులో బైడెన్ 49.3 శాతం, ట్రంప్ 48.7 శాతం ఓట్లు నమోదయ్యాయి. నెవెడాలో విజయం సాధిస్తే అధ్యక్ష పీఠం బైడెన్‎కేనన్న అంచనాలు ఉన్నాయి. మరో ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటివరకు బైడెన్ 264, ట్రంప్‎కు 214 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి.

Tags:    

Similar News