NSUI ఆందోళ‌నలో ఉద్రిక్తత.. రక్తం వచ్చేలా కొట్టిన పోలీసులు

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ : ఇబ్రహీంప‌ట్నం స‌మీపంలోని శ్రీ ఇందు కాలేజీ ఎదుట ఎన్ఎస్‌యూ‌ఐ ఆధ్వర్యంలో చేప‌ట్టిన ఆందోళ‌న ఉద్రిక్తత‌ల‌కు దారితీసింది. కాలేజీ యాజ‌మాన్యం కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌చ‌డంలేదని ఆరోపిస్తూ NUSI కార్యకర్తలు కాలేజీ ఎదుట భారీ సంఖ్యలో బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు వ‌చ్చి ఆందోళ‌న‌కారుల‌కు స‌ర్దిచెప్పే ప్రయ‌త్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల‌కు, విద్యార్థుల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి విద్యార్థుల‌ను చెద‌ర‌గొట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళ‌న‌కారుల‌ను అరెస్ట్ చేసి ఆధిభ‌ట్ల […]

Update: 2021-07-05 06:07 GMT

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ : ఇబ్రహీంప‌ట్నం స‌మీపంలోని శ్రీ ఇందు కాలేజీ ఎదుట ఎన్ఎస్‌యూ‌ఐ ఆధ్వర్యంలో చేప‌ట్టిన ఆందోళ‌న ఉద్రిక్తత‌ల‌కు దారితీసింది. కాలేజీ యాజ‌మాన్యం కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌చ‌డంలేదని ఆరోపిస్తూ NUSI కార్యకర్తలు కాలేజీ ఎదుట భారీ సంఖ్యలో బైఠాయించారు.

ఈ క్రమంలో పోలీసులు వ‌చ్చి ఆందోళ‌న‌కారుల‌కు స‌ర్దిచెప్పే ప్రయ‌త్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల‌కు, విద్యార్థుల‌కు మ‌ధ్య తోపులాట జ‌రిగింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి విద్యార్థుల‌ను చెద‌ర‌గొట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళ‌న‌కారుల‌ను అరెస్ట్ చేసి ఆధిభ‌ట్ల పీఎస్‌కు త‌ర‌లించారు. అయితే, లాఠీచార్జ్‌లో ప‌లువురు విద్యార్థులు గాయ‌ప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగా NUSI నేత‌లు మాట్లాడుతూ.. కాలేజీ యాజ‌మాన్యం ప్రభుత్వానికి వ‌త్తాసు ప‌ల‌క‌కుండా ప‌రీక్షల‌న్నీ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థుల‌కు బోధ‌న‌, ప‌రీక్షలు ఆన్‌లైన్‌లోనే నిర్వహించాల‌ని, ఆఫ్‌లైన్‌లో నిర్వహించొద్దన్నారు. విద్యార్థులు కరోనా బారిన ప‌డితే ఎవ‌రు బాధ్యత వ‌హిస్తార‌ని నిల‌దీశారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నార‌ని, ప్రభుత్వం వెంట‌నే ప‌రీక్షలు ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. మ‌రోవైపు విద్యార్థుల‌ను ఫీజుల పేరుతో కాలేజీ యాజ‌మాన్యం వేధిస్తోంద‌ని ఆరోపించారు. ఫీజు చెల్లిస్తేనే హాల్ టికెట్లు ఇస్తామ‌ని బెదిరిస్తున్నార‌ని, క‌రోనా కాలంలో ప్రజ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, ఇలాంటి త‌రుణంలో విద్యార్థుల త‌ల్లిదండ్రుల‌ను వేధించ‌డం స‌రికాద‌న్నారు.

 

Tags:    

Similar News