టెన్షన్ టెన్షన్.. కౌన్ బనేగా ఎమ్మెల్సీ..!
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మరికొన్ని గంటల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. నువ్వా..నేనా అంటూ సాగిన పట్ట భద్రుల ఎమ్మెల్సీ పోరులో గెలుపెవరది అన్నదే ఇప్పడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసన తర్వాత రకరకాల ఊహాగాహనాలు వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు, అభ్యర్థులు, నాయకుల ఆలోచనలన్నీ గెలుపోటములపైనే ఉన్నాయి. ఎవరు గెలుస్తారు.. ఎవరూ ఓటమి పాలవుతారన్న విషయంపై తీవ్ర చర్చోప చర్చలు సాగుతున్నాయి. […]
దిశ ప్రతినిధి, మేడ్చల్ : మరికొన్ని గంటల్లో ఎమ్మెల్సీ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. నువ్వా..నేనా అంటూ సాగిన పట్ట భద్రుల ఎమ్మెల్సీ పోరులో గెలుపెవరది అన్నదే ఇప్పడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసన తర్వాత రకరకాల ఊహాగాహనాలు వినిపిస్తున్నాయి. ప్రధాన పార్టీలు, అభ్యర్థులు, నాయకుల ఆలోచనలన్నీ గెలుపోటములపైనే ఉన్నాయి. ఎవరు గెలుస్తారు.. ఎవరూ ఓటమి పాలవుతారన్న విషయంపై తీవ్ర చర్చోప చర్చలు సాగుతున్నాయి. ఏ ఇద్దరు కలుసుకున్నా రాజకీయ అంశాలే చర్చకు వస్తున్నాయి. గెలుపోటములపై పార్టీలు, అభ్యర్థుల అంచనాలేలా ఉన్నా.. ఆయా పార్టీలు మాత్రం మా అభ్యర్థులే గెలుస్తారని ధీమా తో ఉన్నారు.
బెట్టింగ్‌లు.. సవాళ్లు..
లెక్కింపు సమయం సమీపిస్తున్న కొద్ది బెట్టింగ్‌లు, సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగుతున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థి, మెజారిటీపై రూ.లక్షల్లో బెట్టింగ్లు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి ఇరవైవేలకు పైగా మెజారిటీతో గెలుస్తారంటూ గులాబీ శ్రేణులు పందాలకు రేడి అవుతున్నారు. మా పార్టీ అభ్యర్థి రాంచందర్ రావు కనీసం 10 వేల మెజారిటీతో గెలుస్తాడని ఆ పార్టీ వర్గీయులు పందాలు కాస్తున్నారు.. అధిక్యం అనవసరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిన్నారెడ్డి గెలుపు ఖాయమంటూ హస్తం నేతలు బెట్టింగ్‌లకు దిగుతున్నారు.అయితే కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాదని ప్రత్యర్థి పార్టీలు పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉపాధ్యాయులు కొందరు హర్షవర్దన్ రెడ్డి గెలుస్తారని, ఆయన గెలిస్తే.. ఓ రిసార్ట్ లో గెట్ టుగేదర్ పార్టీ ఇస్తానని ఓ ఉపాధ్యాయ వర్గం ప్రచారం చేస్తోంది. హర్షవర్దన్ గెలుపుపై మీరు రూ.20 వేలు ఇస్తే..మేము లక్ష రూపాయాలు ఇస్తామంటూ మరో ఉపాధ్యాయ యూనియన్ సవాల్ విసురుతున్నట్లు తెలిసింది. మరికొందరు పట్టభద్రులు అధిక సంఖ్యలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు ఓటు వేశారని, ఆయనే విజయం సాధిస్తాడని ఓ ఆసోసియేషన్ నేతలు పేర్కొంటూ.. ఒకవేళ నాగేశ్వర్ రావు ఓడిపోతాడని పందెం కాసేవాళ్లు ముందుకు రూ.10వేలకు, రూ.20వేలు చేల్లిస్తామని సవాల్ విసురుతున్నారు.
సైలెంట్ ఓటింగ్.. స్పష్టతా గోప్యం..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనివిధంగా భారీ ఓటింగ్ నమోదైంది. సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రధాన పార్టీలు ప్రచారం నిర్వహించాయి.ఓ పార్టీపై మరో పార్టీ కత్తులు దూసుకున్నాయి. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. పెద్ద ఎత్తున గ్రాడ్యుయేట్లతో ఓట్లు వేయించడంలో సక్సెస్ అయ్యాయి. పోలింగ్ రోజున పట్టభద్రులు బారులు తీరి మరీ ఓటేసారు. దీంతో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం చేకూరుస్తుందని లీడర్లు,కేడర్ లెక్కలు వేసుకుంటున్నారు. గెలుపు తమదంటే తమదేనని అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ ధీమా వ్యక్తం చేయగా,ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు సైతం విజయం తమనే వరిస్తుందని బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయనున్నాయి. తెలంగాణలోని పది ఉమ్మడి జిల్లాలకుగాను ఆరు జిల్లాల్లో జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయా పార్టీల భావితవ్వాన్ని నిర్ణయిస్తాయి.ఏ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుపొందిన మిగితా పార్టీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ శాతం అధికంగా నమోదు కావడంతో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారో.. అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. అధికార టీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను ఏ పార్టీ క్యాచ్ చేసుకుంటే అదే గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకవేల వ్యతిరేక ఓటు చీల్చితే జాతకాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో తెలంగాణ లో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ వాతావరణమే కనిపిస్తోంది.