చిత్తూరులో ఉద్రిక్తత

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరులో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పలువురిలో మానవీయ కోణం చచ్చిపోయింది. కరోనా మృతుల అంత్యక్రియలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే… జిల్లాలోని రంగంపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ స్థలంలో కరోనాతో మృతిచెందిన వారిని అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు అక్కడికి ఆ మృతదేహాలను అక్కడికి తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలు పెట్టి రోడ్డుపైనే పడుకున్నారు. అంతేకాదు.. మా ఊరి దగ్గర్ […]

Update: 2020-07-24 01:34 GMT

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరులో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పలువురిలో మానవీయ కోణం చచ్చిపోయింది. కరోనా మృతుల అంత్యక్రియలు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే… జిల్లాలోని రంగంపేటలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ స్థలంలో కరోనాతో మృతిచెందిన వారిని అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు అక్కడికి ఆ మృతదేహాలను అక్కడికి తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో ఆ గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్లు, ఇతర వాహనాలు పెట్టి రోడ్డుపైనే పడుకున్నారు. అంతేకాదు.. మా ఊరి దగ్గర్ లో కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహించొద్దని వారు డిమాండ్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకే మేం అంత్యక్రియలు ఇక్కడ నిర్వహిస్తున్నామని అధికారులు వారికి చెప్పారు. అయినా కూడా ఆ గ్రామస్తులు అడ్డగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Tags:    

Similar News