Vijayawada: జగన్‌కు బిగ్ షాక్.. సంచలన డిమాండ్ చేస్తూ పాదయాత్ర

విజయవాడలో వైఎస్ షర్మిల పాదయాత్ర నిర్వహించి సంచలన డిమాండ్ చేశారు

Update: 2024-11-26 12:41 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada) ఆంధ్రరత్న భవన్ నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు APCC చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి(APCC Chief YS Sharmila Reddy) పాదయాత్ర నిర్వహించారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో అమెరికా న్యూయార్క్‌(America New York)లో నమోదైన ఆదానీ లంచం కేసు(Adani Bribery Case)లో రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) పేరు ప్రస్తావనపై ఆమె సంచలన డిమాండ్ చేశారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఎటువంటి దర్యాప్తు లేదన్నారు. అదానీని బీజేపీ(Bjp) కాపాడుతుందన్నారు. ఇప్పటికైనా జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Cm Chandrababu) కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవడంలేదని విమర్శించారు. రూ. 1750 కోట్లు లంచం తీసుకుంటే కనీసం విచారణ కూడా చేయరా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ అదానీకి, మోడీకి బయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అన్ని సాక్ష్యాలు ఉన్నాయని అమెరికా FBI చెప్పినా దర్యాప్తు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు. ఎంఎల్ఏలు అసెంబ్లీకి వెళ్ళాని రాజ్యాంగం చెబుతుంటే.. కానీ వీళ్లు వెళ్లడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ‌కి పోనీ వాళ్ళు రాజ్యాంగం ప్రకారం రాజీనామాలు చేయాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News