రేణిగుంట విమానాశ్రయంలో ఉద్రిక్తత

దిశ, ఏపీ బ్యూరో : రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తిరుపతిలో నిరసన చేపట్టడానికి విమానంలో రేణిగుంట వెళ్లిన చంద్రబాబు నాయుడిని పోలీసులు ఫ్లైట్‌లోనే నిర్భందించారు. ఆయనను విమానం దిగకుండా 45 నిమిషాలపాటు కట్టడి చేశారు. మరోవైపు చంద్రబాబు కోసం టీడీపీ శ్రేణులు భారీగా వినామాశ్రయం వద్దకు చేరుకున్నాయి. చంద్రబాబు నిరసనకు అనుమతి లేదని పోలీసులు ఆదివారమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్త్ […]

Update: 2021-02-28 23:53 GMT

దిశ, ఏపీ బ్యూరో : రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తిరుపతిలో నిరసన చేపట్టడానికి విమానంలో రేణిగుంట వెళ్లిన చంద్రబాబు నాయుడిని పోలీసులు ఫ్లైట్‌లోనే నిర్భందించారు. ఆయనను విమానం దిగకుండా 45 నిమిషాలపాటు కట్టడి చేశారు. మరోవైపు చంద్రబాబు కోసం టీడీపీ శ్రేణులు భారీగా వినామాశ్రయం వద్దకు చేరుకున్నాయి. చంద్రబాబు నిరసనకు అనుమతి లేదని పోలీసులు ఆదివారమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎయిర్ పోర్టుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు, నాయకులను అడ్డుకుని రేణిగుంట ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా చంద్రబాబు నాయుడును విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అటు తరువాత ఆయన్ను ఎక్కడికి తరలిస్తారనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News