ఊడ్చేపని తప్ప అన్నీ మాతోనే చేయిస్తున్నారు
దిశ, ఏపీ బ్యూరో: ఊడ్చే పని తప్ప అన్నీ తమతోనే చేయిస్తున్నారని తెనాలి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో నర్సులు ఆందోళనకు దిగారు. ప్రాణాలకు తెగించి కరోనాను అరికట్టేందుకు విధులు నిర్వర్తిస్తున్నా తమకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్పత్రిలో విధుల్లో ఉన్నవారికి కనీసం మాస్కులు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాబ్ సిబ్బంది చేయాల్సిన శ్వాబ్ కలెక్షన్లు కూడా తమ చేతనే చేయిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులకు […]
దిశ, ఏపీ బ్యూరో: ఊడ్చే పని తప్ప అన్నీ తమతోనే చేయిస్తున్నారని తెనాలి గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో నర్సులు ఆందోళనకు దిగారు. ప్రాణాలకు తెగించి కరోనాను అరికట్టేందుకు విధులు నిర్వర్తిస్తున్నా తమకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్పత్రిలో విధుల్లో ఉన్నవారికి కనీసం మాస్కులు, పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాబ్ సిబ్బంది చేయాల్సిన శ్వాబ్ కలెక్షన్లు కూడా తమ చేతనే చేయిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదని.. విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు.