పదేళ్ల బాలుడు.. రూ.10 లక్షలు చోరీ

దిశ, వెబ్‌డెస్క్: పదేండ్ల బాలుడు బ్యాంక్ రాబరి చేశాడు. అవును మీరు విన్నది నిజమే.. ఓ బ్యాగ్‌ వేసుకొని బ్యాంక్‌లోకి వచ్చిన బాలుడు ఏకంగా పది లక్షల రూపాయలు అపహరించాడు. అందరు ఉన్నప్పుడే అవలీలగా ఆ బాలుడు దోచుకెళ్లాడు. డబ్బులు దొచుకెళ్లిన సంగతి ఉద్యోగులకు తెలియకపోవడం గమనార్హం. అసలు డబ్బు ఎలా మాయం అయిందని వాపోయిన బ్యాంక్ యాజమాన్యం సీసీ పుటేజీ చూసి షాక్ అయింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో జరిగిన బ్యాంక్ చోరీ కేసు పోలీసులనే […]

Update: 2020-07-15 08:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: పదేండ్ల బాలుడు బ్యాంక్ రాబరి చేశాడు. అవును మీరు విన్నది నిజమే.. ఓ బ్యాగ్‌ వేసుకొని బ్యాంక్‌లోకి వచ్చిన బాలుడు ఏకంగా పది లక్షల రూపాయలు అపహరించాడు. అందరు ఉన్నప్పుడే అవలీలగా ఆ బాలుడు దోచుకెళ్లాడు. డబ్బులు దొచుకెళ్లిన సంగతి ఉద్యోగులకు తెలియకపోవడం గమనార్హం. అసలు డబ్బు ఎలా మాయం అయిందని వాపోయిన బ్యాంక్ యాజమాన్యం సీసీ పుటేజీ చూసి షాక్ అయింది. మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ జిల్లాలో జరిగిన బ్యాంక్ చోరీ కేసు పోలీసులనే ఆశ్చర్యపరిచింది.

బ్యాంకులో డబ్బు చోరీకి గురైందని సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బ్యాంకు అధికారులను విచారించారు. అయినా ఫలితం రాలేదు. దీంతో ఓ సారి బ్యాంక్ సీసీ పుటేజీని పరిశీలించారు. ఆ పుటేజీలో కనిపించిన దృశ్యాలను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఓ బ్యాగ్ వేసుకొని వచ్చిన 10 ఏండ్ల బాలుడు ఎవరూ లేని సమయం చూసి నేరుగా క్యాషియర్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. అతడు చిన్నపిల్లడు కావడంతో సెక్యురిటీ సిబ్బంది అంతగా గమనించలేదు. అయితే, క్యాషియర్ ఏదో పనిమీద పక్కన క్యాబిన్ వెళ్లాడు. ఇదే అదునుగా చేసుకున్న బాలుడు నేరుగా వెళ్లి క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బును తీసి బ్యాగులో వేసుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు.

ఇదంతా చూసిన పోలీసులు, బ్యాంక్ యాజమాన్యం అవ్వాక్కయ్యారు. 10 ఏండ్ల బాలుడు ఏకంగా బ్యాంక్‌లోనే చోరీ చేయడంతో ముక్కున వేలేసుకున్నారు. అయితే, పోలీసులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలుడిని ఎరగా వేసి ఎవరో డబ్బు దొంగతనం చేయించుంటారని భావిస్తున్నారు. నిందితులు బ్యాంక్‌లోనే ఉండి ఈ తతంగం అంతా నడిపించారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అటు ఆ బాలుడి కోసం గాలింపు చర్యలు కూడా ముమ్మరంగా మొదలెట్టారు.

Tags:    

Similar News