కలెక్టరేట్ ఎదుట ఆలయ నిర్మాణం.. పూజలో పాల్గొన్న ప్రముఖులు..

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కలెక్టర్ కార్యాలయం ఆవరణలో టీఎన్జీఓ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో నవదుర్గా దేవి ఆలయం నిర్మించారు. ఆలయంలో పూజలు మొదలైన మూడవ రోజు శ్రీమహాగణపతి, ధ్వజస్థంభ, శిఖర, జయ, విజయ ప్రతిమలతో పాటుగా శ్రీ నవదుర్గ మాతా విగ్రహాలను ప్రతిష్టించారు. సోమవారం ఉదయం ధనుర్లగ్న సుముహూర్తమున సిద్దిపేట జిల్లా వర్గల్ గుట్ట పీఠాధిపతులు మధుసూదనానంద సరస్వతి స్వామిజీ చేతుల మీదుగా యంత్ర, విగ్రహ ప్రతిష్టలు , పూర్ణాహుతి కార్యక్రమాలు, తీర్థప్రసాద వితరణ, మహా అన్నదాన […]

Update: 2021-11-08 08:58 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కలెక్టర్ కార్యాలయం ఆవరణలో టీఎన్జీఓ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో నవదుర్గా దేవి ఆలయం నిర్మించారు. ఆలయంలో పూజలు మొదలైన మూడవ రోజు శ్రీమహాగణపతి, ధ్వజస్థంభ, శిఖర, జయ, విజయ ప్రతిమలతో పాటుగా శ్రీ నవదుర్గ మాతా విగ్రహాలను ప్రతిష్టించారు. సోమవారం ఉదయం ధనుర్లగ్న సుముహూర్తమున సిద్దిపేట జిల్లా వర్గల్ గుట్ట పీఠాధిపతులు మధుసూదనానంద సరస్వతి స్వామిజీ చేతుల మీదుగా యంత్ర, విగ్రహ ప్రతిష్టలు , పూర్ణాహుతి కార్యక్రమాలు, తీర్థప్రసాద వితరణ, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో అర్బన్ శాసనసభ్యులు గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, నగర మేయర్ దండు నీతూ కిరణ్, మాజీ శాసన మండలి సభ్యురాలు ఆకుల సుజాత, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి దంపతులు, అదనపు కలెక్టర్ చంధ్రశేఖర్ దంపతులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ అలుక కిషన్ , వైస్ చైర్మన్ సంఘం అమృత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News