అమ్మవారి ఆలయంలో కరోనా కలకలం
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణం కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయంలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఆలయంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆలయంలో డోలు వాయించే 45 ఏళ్ల వ్యక్తికి, ప్రసాదాల కౌంటర్ శుభ్రం చేసే 70 ఏళ్ల వ్రుద్ధురాలికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న అంబికా భాగ్ ఆలయంలోని చిన్నపూజారికి కరోనా సోకింది. దీంతో కరోనా ఎంతమందికి సోకిందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆలయంలోని అందరికీ […]
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణం కనకమహలక్ష్మి అమ్మవారి ఆలయంలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఆలయంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఆలయంలో డోలు వాయించే 45 ఏళ్ల వ్యక్తికి, ప్రసాదాల కౌంటర్ శుభ్రం చేసే 70 ఏళ్ల వ్రుద్ధురాలికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న అంబికా భాగ్ ఆలయంలోని చిన్నపూజారికి కరోనా సోకింది. దీంతో కరోనా ఎంతమందికి సోకిందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆలయంలోని అందరికీ పరీక్షలు చేశారు. రెండు రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి శానిటైజేషన్ కార్యక్రమం చేపట్టారు.