‘ఇది ధర్మానికి దక్కిన విజయంగా భావిస్తున్నాం’
దిశ, రంగారెడ్డి: కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం పైన సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని దేవాలయాల పరిరక్షణ ఉద్యమ సంధానకర్త డాక్టర్ ఎం.వీ సౌందర్ రాజన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ధర్మానికి పెద్ద విజయంగా భావిస్తున్నామని అన్నారు. దేవాలయాలలో ప్రభుత్వ జోక్యం, రాజకీయ జోక్యం ఉండకూడదని దశాబ్ధాలుగా పోరాడుతున్నామని వివరించారు. అనంత పద్మనాభస్వామి ఆలయం మేనేజ్‌మెంట్ వివాదంలో ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిందని తెలిపారు. పద్మనాభ ఆలయ నిర్వహణను ట్రావెన్‌కోర్ […]
దిశ, రంగారెడ్డి: కేరళ రాష్ట్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం పైన సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని దేవాలయాల పరిరక్షణ ఉద్యమ సంధానకర్త డాక్టర్ ఎం.వీ సౌందర్ రాజన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది ధర్మానికి పెద్ద విజయంగా భావిస్తున్నామని అన్నారు. దేవాలయాలలో ప్రభుత్వ జోక్యం, రాజకీయ జోక్యం ఉండకూడదని దశాబ్ధాలుగా పోరాడుతున్నామని వివరించారు. అనంత పద్మనాభస్వామి ఆలయం మేనేజ్‌మెంట్ వివాదంలో ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిందని తెలిపారు. పద్మనాభ ఆలయ నిర్వహణను ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానికే అప్పగించాలని సూచించిందన్నారు. 2011లో కేరళ హైకోర్టు ఆలయ నిర్వహణను ప్రభుత్వానికి అప్పగించాలని తీర్పు వెల్లడించిందని తెలిపారు. దీనిని సవాల్ చేస్తూ ట్రావెన్‌కోర్ రాజవంశీయులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేశారని గుర్తు చేశారు. ఇదే పిటిషన్లో చిలుకూరు బాలాజీ దేవాలయం తరపున డాక్టర్ ఎంవీ.సౌందరరాజన్ ఇంటర్ వినర్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై తొమ్మిదేళ్లు విచారణ జరిపిన కోర్టు గతేడాది తీర్పును రిజర్వ్ చేసి.. నేడు తీర్పు వెల్లడించిందని తెలిపారు. జస్టిస్ లలిత్, జస్టిస్ ఇన్దూ మల్హోత్రాకి ధర్మబద్ధమైన, న్యాయబద్ధమైన తీర్పు వెలువరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.