అశోక్ గజపతి రాజు విరాళాన్ని తిప్పి పంపిన ఈవో
దిశ,వెబ్‌డెస్క్: రామతీర్థం శ్రీరాముడి విగ్రహం తయారీ కోసం అశోక్ గజపతి రాజు విరాళం ఇచ్చారు. లక్షా నూట పదహారు రూపాయల విరాళాన్ని ఆయన స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు. కాగా అశోక్ గజపతి రాజు విరాళాన్ని రామతీర్థం ఆలయం ఈవో తిరిగి పంపారు. రాముడి విగ్రహాన్ని టీటీడీ ఏర్పాటు చేస్తుందని ఆలయ ఈవో తెలిపారు. కాగా దీనిపై అశోక్ గజపతి రాజు ట్వీట్ చేశారు. వ్యవస్థాపక కుటుంబాన్ని దేవస్థానానికి దూరం చేయాలని చూస్తున్నారని తెలిపారు. నోటీసు ఇవ్వకుండా […]
దిశ,వెబ్‌డెస్క్: రామతీర్థం శ్రీరాముడి విగ్రహం తయారీ కోసం అశోక్ గజపతి రాజు విరాళం ఇచ్చారు. లక్షా నూట పదహారు రూపాయల విరాళాన్ని ఆయన స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు. కాగా అశోక్ గజపతి రాజు విరాళాన్ని రామతీర్థం ఆలయం ఈవో తిరిగి పంపారు. రాముడి విగ్రహాన్ని టీటీడీ ఏర్పాటు చేస్తుందని ఆలయ ఈవో తెలిపారు. కాగా దీనిపై అశోక్ గజపతి రాజు ట్వీట్ చేశారు. వ్యవస్థాపక కుటుంబాన్ని దేవస్థానానికి దూరం చేయాలని చూస్తున్నారని తెలిపారు. నోటీసు ఇవ్వకుండా తనను తొలగించారని ఆయన ట్వీట్ చేశారు.