‘నా జీవితానికి నువ్వే మార్గదర్శివి’.. చిరంజీవి భార్య ఎమోషనల్ పోస్ట్!

దివంగత నటుడు చిరంజీవి సర్జా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-18 02:42 GMT

దిశ, సినిమా: దివంగత నటుడు చిరంజీవి సర్జా గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. అర్జున్ సర్జా మేనల్లుడుగా 2009లో కన్నడ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈయన స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు. అలా దాదాపు 22 సినిమాల్లో నటించి మెప్పించిన చిరంజీవి ఎవరూ ఊహించని విధంగా జూన్ 7, 2020 న 39 ఏళ్ల వయసులో కన్నుమూశాడు. ఇక అదే సమయంలో చిరంజీవి సర్జా భార్య ఐదు నెలల గర్భవతి కావడం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే నిన్న చిరంజీవి సర్జా జయంతి కావడంతో ఆయన భార్య మేఘన భర్తను గుర్తు చేసుకుంది. భర్తతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే హ్యపీనెస్.. నువ్వే నా మార్గదర్శివి’ అనే క్యాప్షన్‌ను జతచేసింది. ఇక ఇది చూసిన అభిమానులు తమ హీరోను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నారు. కాగా ఇటీవల ఆయన సోదరుడు ధృవ సర్జా నటించిన ‘మార్టిన్’ చిత్రం థియేటర్లలో విడుదలైందన్న సంగతి తెలిసిందే. విడుదల సమయంలో అన్నకు ప్రత్యేకంగా ఈయన నివాళి అర్పించాడు.

(video link credits to meghana raj sarja instagram id)

Tags:    

Similar News