జపాన్ లో ఒకే థియేటర్ లో ఆర్ఆర్ఆర్ రికార్డు ప్రదర్శన

తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ విదేశాల్లో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.

Update: 2024-10-18 06:11 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్  విదేశాల్లో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రముఖ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వేదికలపై భారత చలన చిత్ర పరిశ్రమ సత్తాను చాటి నాటునాటు పాటతో అస్కార్ అవార్డును సైతం అందుకుని చరిత్ర సృష్టించింది. కలెక్షన్లలోనూ అనేక రికార్డులు అధిగమించిన ఆర్ఆర్ఆర్ సినిమా మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అద్భుత ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఆర్ఆర్ఆర్ రికార్డుల్లో ఆరుదైన రికార్డుకు జపాన్ దేశం వేదికగా నిలువడం చర్చనీయాంశమైంది. జపాన్ లోని ఒక ప్రఖ్యాత థియేటర్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఒక సంవత్సరం 9 నెలలు(21నెలల పాటు) నిర్విరామంగా ప్రదర్శితం కావడం విశేషంగా నిలిచింది. ఒక భారతీయ సినిమా అందులోనూ తెలుగు సినిమాకు ఈ అరుదైన రికార్డు దక్కడం గర్వకారణమైంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తమకు ఇది ఎంతో ఆనందంగా... ఒకింత ఎమోషనల్ గా కూడా ఉందని చెప్పుకొచ్చారు. జపాన్ లో ఆర్ఆర్ఆర్ సినిమా ఇంత లాంగ్ రన్ కావడానికి ఆ దేశంలో జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఉన్న క్రేజ్ కూడా ఓ కారణంగా భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. 


Similar News