Radhika Merchant: రాధిక మర్చంట్ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్.. సందడి చేసిన సెలబ్రిటీలు

ప్రపంచ కుబేరుడైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు కొద్ది రోజుల కిందట రాధికా మర్చంట్‌ను చరిత్రలో నిలిచిపోయేలా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.

Update: 2024-10-18 07:26 GMT

 దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ కుబేరుడైన ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు కొద్ది రోజుల కిందట రాధికా మర్చంట్‌ను చరిత్రలో నిలిచిపోయేలా అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి ప్రముఖ సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు సైతం హాజరై.. కోట్లు విలువ చేసే బహుమతులు కూడా సమర్పించారు. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి అంబానీ కోడలు రాధిక అక్టోబరు 16 న ఘనంగా పుట్టిన రోజును జరుపుకుంది. రాధిక మర్చంట్ బర్త్ డే పార్టీకి ముకేశ్ అంబానీ కుటుంబీకులతో పాటు క్రీడా, సినీ రంగానికి చెందిన ప్రముఖులు హాజరై సందడి చేశారు. బాలీవుడ్ అగ్ర హీరో కుమార్తె సుహానా ఖాన్, జాన్వీకపూర్, ఎంఎస్. ధోనీ, ఆర్యన్ ఖాన్, అర్జున్ కపూర్, రణ్ వీర్ సింగ్, పహారియా వంటి వారు రాధిక పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలీవుడ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఒరీ ఈ పిక్స్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Full View

Full View


Similar News