మాల్దీవుల్లో యోగా డే భగ్నం.. కర్రలతో దూసుకొచ్చిన దుండగులు (వీడియో)
యోగా చేస్తున్నవారు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. Yoga Day event was disrupted by extremists in Maldives.
దిశ, వెబ్‌డెస్క్ః మాల్దీవుల్లో మంగళవారం జరిగిన యోగా డే కార్యక్రమంపై కొందరు దుండగులు దాడికి ప్రయత్నించారు. గలోల్హు స్టేడియంలో యోగా చేస్తున్న సమయంలో గుంపులుగా దూసుకొచ్చని వ్యతిరేకవాదులు కర్రలతో దాడికి ప్రయత్నించారు. నాటకీయ పరిణామాల మధ్య యోగా చేస్తున్నవారు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్రర్లు కొడుతోంది. ఈ ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదు. అయితే, దాడి అనంతరం ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్న తర్వాత కార్యక్రమాన్ని పునఃప్రారంభించారు.
Dramatic visuals from Maldives as group of extremists disrupt Yoga Day celebrations organised in capital Male pic.twitter.com/es9q3y5g2o
— Sidhant Sibal (@sidhant) June 21, 2022
యువజన, క్రీడలు, కమ్యూనిటీ సాధికారత మంత్రిత్వ శాఖ, UN మాల్దీవులతో పాటు మాల్దీవుల్లోని భారత హైకమిషన్ ఈ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఈ ఘటనపై దర్యాప్తు చేపడతామన్నారు. "ఈ ఉదయం గలోల్హు స్టేడియంలో జరిగిన సంఘటనపై మాల్దీవుల పోలీసులచే దర్యాప్తు ప్రారంభించాము" అని పేర్కొన్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని, బాధ్యులను త్వరగా చట్టం ముందు ప్రవేశపెడతామని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.
Dramatic visuals from Maldives as group of extremists disrupt Yoga Day celebrations organised in capital Male pic.twitter.com/es9q3y5g2o
— Sidhant Sibal (@sidhant) June 21, 2022