రూ.18 వేలతో ఆ అధికారి గుట్టురట్టు!

Update: 2022-03-04 14:29 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్లారెడ్డి డీఈ భద్రయ్య రూ.18 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా శుక్రవారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కామారెడ్డికి చెందిన క్లాస్ 2 కాంట్రాక్టర్ సాయి ఎల్లారెడ్డి డివిజన్ లో తాను చేసిన పనికి సంబంధించిన రూ.3లక్షల బిల్లు మంజూరు కోసం డీఈ భద్రయ్య దగ్గరకి వెళ్ళాడు. ఆయన ఆ బిల్లు చెల్లించాలంటే రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ కాంట్రాక్టర్ అంతగా ఇచ్చుకోలేనని బతిమిలాడితే చివరకు రూ.18 వేలకు అంగీకరించాడు. దీంతో ఆ బాధితుడు ఏసీబీకి సమాచారం అందించాడు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం డబ్బులు తీసుకునేటప్పుడు దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం డీఈ భద్రయ్య ఇంట్లో, కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో నిజామాబాద్ రెంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్, ఇన్ స్పెక్టర్లు నాగేశ్, శ్రీనివాస్ ఉన్నారు.

Tags:    

Similar News