‘కేజీఎఫ్-3’ మూవీ అప్డేట్ ఇచ్చిన యశ్.. ఆసక్తికర కామెంట్స్ వైరల్

కన్నడ స్టార్ హీరో యశ్(Yash), ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’(KGF).

Update: 2024-10-23 09:00 GMT

దిశ, సినిమా: కన్నడ స్టార్ హీరో యశ్(Yash), ప్రశాంత్ నీల్ (Prashanth Neel)కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘కేజీఎఫ్’(KGF). మొదటి షో నుంచి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు బాక్సాఫీసు వద్ద ఊహించని వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్-2’ మూవీ ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువ రెస్సాన్స్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో.. సినీ ప్రియులంతా ‘కేజీఎఫ్-3’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో యశ్(Yash) ‘కేజీఎఫ్-3’ (KGF-3)అప్డేట్ ఇచ్చారు. ‘‘మేము ప్రామిస్ చేసినట్లుగా ‘కేజీఎఫ్-3’ ఖచ్చితంగా వస్తుంది.

మాకు ఒక ఆలోచన ఉంది. దాని ప్రకారంగానే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. సరైన సమయం వచ్చినప్పుడు మీ కూడా ఆ ఆలోచన గురించి వెల్లడిస్తాము. ‘కేజీఎఫ్-3’(KGF-3) భారీగా ప్లాన్ చేస్తున్నారు. ప్రేక్షకులు గర్వపడే విధంగా మేము చేస్తాము. ఎందుకంటే ఇది ఒక కల్ట్ మూవీ. నేను, ప్రశాంత్ నీల్ దీనిపై చర్చిస్తున్నాము. తొందరలోనే ఇందుకు సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అప్డేట్ కూడా ఇస్తాము. అభిమానులు కొంత సమయం వేచి ఉండండి’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యశ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Similar News