ప్రపంచంలోనే అత్యంత సన్నని స్కై-స్క్రాపర్.. అమ్మకాలు మొదలు పెట్టిన అమెరికా..
దిశ, వెబ్‌డెస్క్: స్కై-స్క్రాపర్స్.. వాటిపై నుంచి ప్రపంచాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ కొందరికి మాత్రమే అది కుదురుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: స్కై-స్క్రాపర్స్.. వాటిపై నుంచి ప్రపంచాన్ని చూడాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. కానీ కొందరికి మాత్రమే అది కుదురుతుంది. ప్రపంచం వ్యాప్తంగా ఎన్నో స్కై-స్క్రాపర్స్ ఉన్నాయి. తాజాగా అమెరికాలో సరికొత్త స్కై-స్క్రాపర్ ఓపెన్ అయింది. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్కై-స్క్రాపర్‌గా ఇది రికార్డు చేసింది. దీనికి స్టెయిన్‌వే టవర్ అని నామకరణం చేశారు. దీని ఎత్తు 1,428 అడుగులు కాగా ఈ స్కై-స్క్రాపర్ 1:24 నిష్పత్తిలో నిర్మించారు. అంటే ఈ బిల్డింగ్ 1 అడుగు విస్తీర్ణం ఉన్న స్థలంలో 24 అడుగుల కట్టడంలా ఉంటుంది. ఇందులో మొత్తం 84 ఫ్లోర్లు ఉన్నాయి. అందులో 60 ఫ్లాట్స్ ఉన్నాయి. అమెరికా ఈ స్కై-స్క్రాపర్‌లోని ఫ్లాట్ల అమ్మకాలను ప్రారంభించింది. వీటి ధర దాదాపు రూ.59 కోట్ల నుంచి స్టార్ట్ అవుతాయి. ఇందులోని స్టూడియో ఫ్లాట్ ధర 7.75 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో అక్షరాల రూ.59 కోట్లు. అదే విధంగా ఇందులోని పెంట్‌హౌస్ ధర 66 మిలియన్ డాలర్లు అంటే రూ.500 కోట్లు.