ఒకేలా ఉంటారు.. ఒకే బాయ్‌ఫ్రెండ్‌తో ఇలా కావాలంట..?! (వీడియో)
వీరిలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. Twins Want To Get Pregnant Together With The Boyfriend They 'Share'
దిశ, వెబ్‌డెస్క్ః అన్నా, లూసీ డిసింక్‌లు కొన్ని సంవత్సరాల క్రితం ఇంటర్నెట్‌లో సంచలనమయ్యారు. టాప్ టు బాటమ్ ఒకేలా ఉండే వీళ్లు ఒకే ప్రియుణ్ణి పంచుకున్నారని, ఇద్దరూ అతణ్నే వివాహం చేసుకోవాలనుకుంటున్నారని చెప్పారు. అయితే, ఆస్ట్రేలియాలో బహు భార్యత్వం చట్టవిరుద్ధం గనుక కలిసే సహజీవనం చేస్తున్నారు. ఇక, పెర్త్‌కు చెందిన ఈ ఆస్ట్రేలియన్ తోబుట్టువులు 2012 నుండి బెన్ బైర్న్‌తో డేటింగ్ చేస్తుండగా, ఇద్దరూ ఒకటేసారి గర్భం దాల్చి, ఒకే సమయంలో ప్రసవించాలనే ఆలోచనలో ఉన్నారు. ఇది విన్న డాక్టర్ షాకయ్యి, సహజంగా అయితే కుదరదని చెప్పడంతో ఇప్పుడు ఐవిఎఫ్ ద్వారా పిల్లల కోసం ప్రయత్నించాలనుకుంటున్నారు. అయితే, తమ భాస్వామ బైర్న్ మాత్రమే తండ్రి కావాలంటున్నారు.
వరల్డ్ మోస్ట్ ఐడెంటికల్ ట్విన్స్‌గా గుర్తింపు ఉన్న వీరిలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఉదయం లేచిన దగ్గర నుండి కలిసే బాత్‌రూమ్‌కి వెళతారు, కలిసే స్నానం చేస్తారు. కలిసే నిద్రపోతారు. ఇక తినే తిండి కూడా అంతే, ఒకే పరిమాణంలో, ఒకేలాంటి ఆహారాన్ని, ఒకే సమయంలో తింటారు. ప్రతిదీ ఒకేలా చేయడాన్ని అలావాటు చేసుకున్న వీళ్లకు ఇదొక అబ్సెసివ్ మారింది. అయినా, వాళ్లిద్దరూ జీవితాన్ని ఇలాగే గడపాలనుకోవడం విశేషం. ఏడాది క్రితం నుండి చేస్తున్న వీరి గర్భాధారణ ప్లాన్ ఇంకా సక్సెస్ కాలేదు. తమ ప్రియుడు బైర్న్‌తో కలిసి ఒకే సమయంలో గర్భవతులు అయ్యే మార్గంలోనే ఉన్నారు.