Rajnath Singh: ఉగ్రవాదులకు హెచ్చరికలు జారీ చేసిన రాజ్‌నాథ్ సింగ్

డిస్పూర్: ఉగ్రవాదుల పై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ వెనకడుగు వేయదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు..Latest Telugu News

Update: 2022-04-23 13:34 GMT

Rajnath Singh

డిస్పూర్: ఉగ్రవాదుల పై కఠిన చర్యలు తీసుకునేందుకు భారత్ వెనకడుగు వేయదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) అన్నారు. సరిహద్దు వెలుపల నుంచి భారత్‌ను లక్ష్యంగా చేసుకునే ముష్కరులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని శనివారం స్పష్టం చేశారు. అసోంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశం నుంచి ఉగ్రవాదం తుడిచి పెట్టేందుకు కేంద్రం పనిచేస్తుందని ఆయన చెప్పారు. 'ఉగ్రవాదానికి సరైన సమాధానం ఇవ్వడంలో భారత్ విజయవంతంగా ఉంది. దేశాన్ని లక్ష్యంగా చేసుకుని సరిహద్దు అవతల ఉన్న ముష్కరుల పై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం' అని అన్నారు. దేశం తూర్పు సరిహద్దు ప్రస్తుతం పశ్చిమ సరిహద్దుతో పోలిస్తే మరింత శాంతి, స్థిరత్వాన్ని కలిగి ఉందని చెప్పారు. బంగ్లాదేశ్ స్నేహపూర్వక పొరుగు దేశం కావడం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ఉగ్రవాదుల చొరబాటు సమస్య దాదాపు ముగిసిందని తెలిపారు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రత్యేక ఆయుధాల చట్టాన్ని వెనక్కి తీసుకుందని చెప్పారు.

Tags:    

Similar News