నచ్చిన యువకుడితో రాత్రంతా సెక్స్.. కానీ పెళ్లి చేసుకోరు.. అక్కడి అమ్మాయిల తీరే వేరు !
మన దేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పెళ్లంటే నూరేళ్లపంట. పెళ్లి తర్వాత దాంపత్య జీవితంలో భార్యలు, భర్తలను దేవుడిలా భావిస్తారు.
దిశ, వెబ్‌డెస్క్ : మన దేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం పెళ్లంటే నూరేళ్లపంట. పెళ్లి తర్వాత దాంపత్య జీవితంలో భార్యలు, భర్తలను దేవుడిలా భావిస్తారు. తన భర్తను కాకుండా పరాయి.. మగాడిని కన్నెత్తి కూడా చూడరు. ఒకవేళ పరాయి మగాడితో చనువుగా మెలిగినా.. వివాహేతర సంబంధాలు కొనసాగించినా వాటిని నేరంగా భావిస్తారు. మన భారతదేశ చట్టాలు కూడా వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తాయి. భర్త మాటను జవదాటకుండా భార్యలు వ్యవహరిస్తారు. మహిళలు ఇంటి పని చూసుకుంటూ, ఇల్లు చక్కబెడుతుంటారు. పురుషుడు ఇంటి బాధ్యతలు, కుటుంబ భారాన్ని తన భుజాలపై మోస్తుంటాడు. ఇది తరతరాలుగా ఆచరిస్తున్న మన భారతదేశ సంస్కృతి.
ఇప్పుడిప్పుడే సమాజంలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల.. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా సరిసమాన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆధునికత మెరుగుపడడం వల్ల డేటింగ్, లీవింగ్ రిలేషన్ షిప్, వన్ నైట్ స్టాండ్ వంటివి మనదేశంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. అయితే మన సంప్రదాయాలన్నింటికి భిన్నంగా వ్యవహరించే గ్రామం మన దేశ సరిహద్దుల్లో ఉంది. ఇక్కడ ఉండే పిల్లలకు తండ్రులు ఉండరు. తల్లి లేదా మేనమామే ఆ పిల్లలను పెంచి పోషిస్తారు. అదేంటి తండ్రి లేకుండా పిల్లలను ఎలా చూసుకుంటారు..? అదేలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఆసక్తి రేకెత్తించే ఈ కథనం చదవాల్సిందే..
హిమాలయాల్లోని టిబెట్ సరిహద్దుల్లో నివసిస్తున్న యున్నాన్, సిచువాన్‌లో 'మొసువో' అనే పురాతన గిరిజన ప్రజలు ఓ సంప్రాదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి ప్రజల్లో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనే లక్ష్యం ఉండదు. అయితే వారికి లైంగిక స్వేచ్ఛ ఉంటుంది. అది విచ్చలవిడిగా కాకుండా ఒక పద్ధతిలో సాగుతుంది. ఈ వింత సంప్రదాయాన్ని అక్కడ 'జౌహున్' (వాకింగ్ మ్యారేజ్) అంటారు. అంటే పెళ్లి చేసుకుని ఎవరి దారి వారు చూసుకోవడం. ఒకరకంగా చెప్పాలంటే అసలు ఇది పెళ్లి కాదు. మొసుపో సంప్రదాయంలో స్త్రీలే మహారాణులు. అక్కడ పురుషులు డమ్మీలు మాత్రమే. ఇక్కడ కేవలం స్త్రీల పెత్తనమే నడుస్తుంది.
వాకింగ్ మ్యారేజ్ అంటే..?
పురుషుడు తనును ఇష్టపడే మహిళతో ఏకాంతంగా గడుపుతాడు. తిరిగి తెల్లవారుజామున తమ తల్లి లేదా మేనమామ ఇంటికి వెళ్లిపోతాడు. పురుషులు ఏమైనా లైంగిక కోరికలు తీర్చుకోవాలంటే.. రాత్రి వేళల్లో మాత్రమే వెళ్లాలి. ఇందుకు ఆ మహిళ అనుమతి తీసుకోవాల్సిందే. ఆ మహిళ శృంగారానికి నిరాకరిస్తే తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఒకవేళ ఆ మహిళ అంగీకరిస్తే రాత్రి నుంచి ఉదయం వరకు ఆమెతో శృంగారంలో గడపొచ్చు. ఇక్కడి పిల్లలను తల్లికి మాత్రమే రక్తసంబంధీకులుగా పరిగణిస్తారు. తండ్రి కేవలం వీర్యదాత మాత్రమే.
వన్‌నైట్ స్టాండ్ పేరిట ఎవరితోనైనా ఎంజాయ్ చేయవచ్చు. ఇక్కడ మరొక వింత ఆచారం కూడా ఉంది. 'యాక్సియా' అనే సాంప్రదాయం కింద వన్ నైట్ స్టాండ్‌ను కూడా పాటిస్తారు. అంటే ఇక్కడి మహిళలు కేవలం తనకు ఇష్టమైన పురుషుడితోనే జీవితాంతం గడపాలని లేదు. నచ్చిన వ్యక్తితో స్త్రీలు రాత్రంతా గడపొచ్చు. ఆ తర్వాత వారితో ఎటువంటి సంబంధాలు ఉండవు. ఒకవేళ ఆ పురుషుడి వల్ల గర్భం దాల్చితే.. 'వాకింగ్ మ్యారేజ్' కింద పరిగణించి ఆ బిడ్డను తల్లి లేదా మేనమామ పెంచుతారు. ఇతర పురుషులు తన ఇంట్లోకి రాకూడదని, తన నివాసం ముందు తనతో ఏకాంతంగా ఉండే పురుషుడి టోపిని తగిలిస్తుంది. అలా తగిలించడం ద్వారా మరో వ్యక్తి ఆ సమయంలో ఇంట్లోకి రాకుండా ఉంటారు.
ఇక్కడ వివాహ సంప్రదాయాలే కాదు.. ప్రతిది మన సంప్రదాయాలకు భిన్నంగా ఉంటుంది. స్త్రీలు మాత్రమే ఆస్తులను వారసత్వంగా పొందుతారు. వ్యవసాయం చేస్తారు. పిల్లలను పెంచి పోషిస్తారు. ఇంటి బాధ్యతలన్ని స్వీకరిస్తారు. పురుషులు కేవలం వ్యవసాయ క్షేత్రాలను దున్నడం, నిర్మాణాలు, జంతువులను వేటాడటం, ఖాళీగా ఉండటం మాత్రమే పురుషుల పని. మొసువో సమాజంలో పిల్లలకు తండ్రి ఎవరో తెలియదు. వారి తల్లి, మేనమామే వారి లోకం. కానీ, పురుషులు ఎటువంటి అవసరాలు ఎదురైనా స్త్రీలకు సాయం చేస్తారు
1990 నుంచి చైనాలో పరిస్థితులు మారాయి. బయటి ప్రపంచంలో వైవాహిక జీవితాల గురించి వారికి ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది. అయినా కూడా మొసుపో ప్రజలు వాకింగ్ మ్యారేజ్ సాంప్రదాయమే ఉత్తమమ అని భావిస్తు్న్నారు.