Allu Arjun: పుష్ప 2 లో అల్లు అర్జున్, రష్మిక కాలు పట్టుకున్న సీన్ హైలెట్ గా నిలవనుందా?

అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప 2 ( pushpa 2)

Update: 2024-11-18 02:40 GMT

దిశ, వెబ్ డెస్క్ : అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా తెరకెక్కిన మూవీ పుష్ప 2 ( pushpa 2) ఈ సినిమా ట్రైలర్ ఆదివారం సాయంత్రం రిలీజ్ అయింది. బీహార్ పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించగా నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం గ్యారంటీ అన్నట్లు తెలుస్తుంది. ప్రతీ డైలాగ్ థియేటర్లలో పేలడం పక్కా అని అంటున్నారు.

పుష్ప కి మించి పుష్ప 2 ఉండబోతుందని సినీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటికి చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తగ్గేదే లే అనే డైలాగ్ వాడుతూనే ఉంటారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఇంకో రేంజ్ లో మూవీ ఉంటుందని అర్ధమవుతుంది.

ట్రైలర్ లో చాలా మాస్ షాట్స్ మాత్రమే కాకుండా పాటు రష్మికతో ( Rashmika Mandanna ) రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. అయితే ఓ షాట్ లో రష్మిక కాలుతో అల్లు అర్జున్ తన గడ్డం దగ్గర తగ్గేదేలే అంటూ పుష్ప మేనరిజం చేయడం చూపించారు. ఇది వైరల్ గా మారింది. ఒక స్టార్ హీరో హీరోయిన్ కాలు పట్టుకోవడం అంటే మాములు విషయం కాదు. ఆలాంటి ఆలోచన వచ్చినందుకు డైరెక్టర్ సుకుమార్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇలాంటి షాట్స్, సీన్స్ సినిమాలో ఇంకా ఎన్ని ఉన్నాయో చూడాలి మరి.

Read More...

దుమ్మురేపుతున్న ‘పుష్పా-2’ ట్రైలర్ : హీరో విశ్వక్సేన్ సంచలన కామెంట్స్





Full View

Tags:    

Similar News