ఒకవేళ అదే నిజమైతే.. ధోని తర్వాత ఎవరు?

బెంగళూరు: ఐపీఎల్ -2022 సీజన్ తర్వాత చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు..Who will replace Dhoni as CSK Captain

Update: 2022-03-22 02:46 GMT

బెంగళూరు: ఐపీఎల్ -2022 సీజన్ తర్వాత చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్‌కు గుడ్ బై చెబుతాడనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ధోని తర్వాతి స్థానాన్ని చైన్నయ్ ఫ్రాంచైజీ ఎవరితో భర్తీ చేయనుందని ఇప్పటికే చర్చ మొదలైంది. తాజాగా ఈ విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. 40 ఏళ్ల ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుని జట్టులో కొనసాగినా నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై చెన్నయ్ యాజమాన్యం ఇప్పుడే తొందరపడదని ఆకాశ్ చోప్రా అభిప్రాయం వ్యక్తం చేశారు. ధోనీ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని ఎంచుకోవడానికి చెన్నయ్ జట్టుకు ఇప్పుడు ఒక అవకాశం ఉంది. మ్యాచులు ప్రారంభమయ్యాక ఏ ఆటగాడు ఆ స్థానానికి సరిగ్గా సరిపోతాడో ఒక అంచనాకు రావొచ్చు. అందులో జడేజా, మొయిన్‌ అలీ లాంటి ఆటగాళ్లు ముందు వరుసలో ఉంటారు. కానీ, ధోనీ ఉన్నంతకాలం చెన్నయ్ ఆ స్థానంలో మరొకరి గురించి ఆలోచించదు. అయితే, జడేజా ఈసారి ధోనీ కన్నా అధిక మొత్తం తీసుకుంటున్నందున ఆ స్థానానికి అతడే సరైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. అదే నిజమైతే దానికి ఇప్పుడే గ్రౌండ్ వర్క్ జరగకపోవచ్చని చోప్రా వివరించాడు. ఇదే విషయంపై మరో మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌ స్పందించాడు. చెన్నయ్ ఇప్పుడే భవిష్యత్‌ కెప్టెన్‌ గురించి ఆలోచిస్తుందని నేనూ అనుకోవడం లేదు. ఎవరైనా ప్రస్తుత పరిస్థితుల గురించే ఆలోచిస్తారు. ఇక టీ20 లాంటి పొట్టి క్రికెట్‌లో ఇతర విషయాల గురించి ఆలోచించడానికి సమయం ఉండదు. ప్రస్తుతం ధోనీతో చాలా మంది యువకులు కలిసి ప్రయాణించొచ్చు. చివరికు చెన్నయ్ జట్టు తమకు బెస్ట్ ఎవరు అని భావిస్తే అతన్నే సారథిగా ఎంపిక చేసుకుంటుందని వెల్లడించాడు.

Tags:    

Similar News